Andhrapradesh
Spam Calls: ఆ కాల్స్‌కు చెక్ పెట్టేలా ట్రాయ్ కీలక నిర్ణయం.. సరికొత్త టెక్నాలజీతో సమస్య ఫసక్..!
కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ) అనే సేవ కేవైసీ ప్రక్రియ సమయంలో సమర్పించిన రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా కాలర్‌కు సంబంధించిన గుర్తింపును ప్రదర్శిస్తుంది. అధిక వాల్యూమ్‌ల మోసపూరిత కాల్‌లు, రోబోకాల్స్, స్పామ్‌ల సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కాల్స్ వల్ల చాలా సార్లు జెన్యూన్ కాల్స్ మిస్ అవుతున్నాయి. ట్రాయ్ ఇంతకు ముందు నవంబర్ 2022 లో సీఎన్ఏపీపై ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌లకు కాలర్ గుర్తింపును ప్రదర్శించడానికి ఒక సేవను సిఫార్సు చేసింది. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ) అనే సేవ కేవైసీ ప్రక్రియ సమయంలో సమర్పించిన రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా కాలర్‌కు సంబంధించిన గుర్తింపును ప్రదర్శిస్తుంది. అధిక వాల్యూమ్‌ల మోసపూరిత కాల్‌లు, రోబోకాల్స్, స్పామ్‌ల సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కాల్స్ వల్ల చాలా సార్లు జెన్యూన్ కాల్స్ మిస్ అవుతున్నాయి. ట్రాయ్ ఇంతకు ముందు నవంబర్ 2022 లో సీఎన్ఏపీపై ఒక కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని పరికరాలకు నిర్దిష్ట కటాఫ్ తేదీ తర్వాత సీఎన్ఏపీ ఫీచర్ ఉండేలా ప్రభుత్వం తగిన సూచనలను జారీ చేయాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. కాబట్టి స్పామ్ కాల్స్ కట్టడికి ట్రాయ్ తీసుకున్న చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
భారత్ కాలర్ ఐడీ అండ్ యాంటీ-స్పామ్, ట్రూకాలర్ వంటి అనేక థర్డ్-పార్టీ అప్లికేషన్‌లు, కొన్ని స్థానిక స్మార్ట్‌ఫోన్ టూల్స్ స్పామ్, కాలింగ్ పార్టీ నేమ్ ఐడెంటిఫికేషన్ సేవలను అందిస్తాయి. అయితే ఈ సేవలు క్రౌడ్ సోర్స్డ్ డేటాపై ఆధారపడినందున ఇవి పూర్తిగా నమ్మదగినవి కాదని ట్రాయ్ పేర్కొంటుంది. అందరు యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు వారి టెలిఫోన్ సబ్‌స్క్రైబర్‌ల అభ్యర్థన మేరకు కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ) సప్లిమెంటరీ సర్వీస్‌ను అందించాలని ట్రాయ్ ఆదేశించింది. బల్క్ కనెక్షన్‌లు, వ్యాపార కనెక్షన్‌లను కలిగి ఉన్న చందాదారులు తమ కస్టమర్ అప్లికేషన్ ఫారమ్ (సీఏఎఫ్)లో పేర్కొన్న పేరుకు బదులుగా వారి ‘ప్రాధాన్యమైన పేరు’ని ప్రదర్శించడానికి అనుమతించాలని ట్రాయ్ సూచించింది. ట్రాయ్‌కు సంబంధించిన సిఫార్సులు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) చొరవపై ఆధారపడి ఉన్నాయి. మార్చి 2022లో సీఎన్ఏపీ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంపై అభిప్రాయాల కోసం రెగ్యులేటర్‌ని కోరింది.
వినియోగదారులకు వచ్చే ఇబ్బందికరమైన, ప్రమోషనల్ లేదా అయాచిత కాల్‌ల సమస్యను పరిష్కరించడానికి మార్గదర్శకాలను రూపొందించడానికి ఓ కమిటీను ఏర్పాటు చేసిన సంగతి విధితమే. ఈ కాల్‌లు వినియోగదారుల గోప్యత హక్కును ఉల్లంఘిస్తాయి. ఇటీవల వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులు స్వీకరించిన ఇబ్బందికరమైన, ప్రమోషనల్ లేదా అయాచిత వాణిజ్య కాల్‌ల సమస్యను పరిష్కరించమే లక్ష్యంగా ఆ కమిటీ పలు సూచనలు చేయనుంది.