Spiritual

చార్ ధామ్ యాత్ర‌కు పొటెత్తిన భక్తులు.. గ‌త ఏడాదికంటే ఎక్కువే!

Published

on

ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌సిద్ధిచెందిన చార్ ధామ్ యాత్ర ఈ నెల‌10న ప్రారంభమైంది. చార్‌ధామ్ యాత్ర‌లో భాగంగా ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లను ద‌ర్శ‌నం ఉంటుంది. అయితే, ఈఏడాది ప్రారంభ‌మైన ఇర‌వై రోజుల్లోనే చార్ ధామ్ యాత్ర‌కు భ‌క్తులు పొటెత్తారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు

ఇక‌, ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర అక్షయ తృతియ రోజున ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర ప్రారంభమైన మొదటి 15 రోజుల్లోనే యమునోత్రి, గంగోత్రి ధామ్ లకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చిన‌ట్లు ఉత్త‌రాఖండ్ అధికారులు పేర్కొన్నారు. ఇక‌, ఈ శుక్రవారం నాడు ఒక్క‌రోజే యమునోత్రి ధామ్ ను 9,812 మంది యాత్రికులు సంద‌ర్శించ‌గా, గంగోత్రి ధామ్ ను 13,602 మంది దర్శించుకున్న‌ట్లు తెలిపారు. ఇక‌, ఈ ఏడాది ఈ రెండు పుణ్యక్షేత్రాలను సందర్శించిన వారి సంఖ్య గ‌త ఏడాదితో పోలిస్తే 3,63,537కి చేరిన‌ట్లు అధికారులు వివ‌రించారు.

భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇక్క‌డ త‌గు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో 1,97,413 మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. 2022లో 2,22,852 మంది యాత్రికులు చార్ ధామ్ యాత్ర‌కు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య మ‌రింత పెరిగింది. ఈ యాత్రకు వెళ్లాల‌నుకునేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉండ‌దు. రిజిస్ట్రేష‌న్‌ ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో అందుబాటులో ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల యాత్రికులను పరిమిత సంఖ్యలో యాత్ర‌కు అనుమతించడానికి వీలవుతుందని, వారికి సరైన సౌకర్యాలు కల్పించ‌గ‌లిగే అవకాశం ఉంటుంద‌నే ఉద్దేశ్యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version