National

Char Dham Portals : ఛార్​దామ్​ ఆలయాల ఓపెనింగ్​పై కీలక అప్డేట్​..

Published

on

Gangotri Dham opening date 2024 : గంగోత్రి ధామ్​ ఆలయ​ ఓపెనింగ్​పై కీలక అప్డేట్​. అక్షయ తృతియ సందర్భంగా.. 2024 మే 10 మధ్యాహ్నం 12:25 గంటలకు పోర్టల్స్​ ఓపెన్​ అవుతాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో ఉన్న గంగోత్రి ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు.

“అన్నింటిని పరిశీలించి, ఒక మంచి సమయాన్ని లెక్కించిన ఆలయ అర్చకులు.. మే 10 మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు గంగోత్రి ధామ్​ పోర్టల్స్​ని ఓపెన్​ చేయాలని సూచించారు,” అని శ్రీ పంచ్​ మందిర్​ సమితి గంగోత్రి ధామ్​కు చెందిన హరీశ్​ సెమ్వాల్​ తెలిపారు.

గంగా మాత శీతాకల నిడివి ప్రాంతమైన ఉత్తరకాశీలోని మూకాంబలో ఆలయ అర్చకులు కలిసి.. పోర్టల్స్​ని తెరిచే విషయంపై చర్చించారని సెమ్వాల్​ చెప్పుకొచ్చారు.

Yamunotri Dham opening date 2024 : ఇక యమునోత్రి ధామ్​ పోర్టల్స్​ ఓపెనింగ్​పై ఈ నెల 14న.. సంబంధిత ఆలయ అర్చకులు ఓ నిర్ణయం తీసుకుంటారు.

“యమునోత్రి ధామ్​ పోర్టల్స్​ తెరిచే విషయంపై.. పవిత్రమైన శుక్ల పక్ష షష్ఠి రోజైన ఏప్రిల్​ 14న ఓ నిర్ణయం తీసుకుంటాము. చైత్ర మాసంలో వచ్చే 6వ రోజు ఇది. ఈ రోజున.. యమున.. భూమిపైకి వచ్చిందని విశ్వసిస్తుంటారు. అందుకే ఆ రోజు అర్చకులు చర్చలు జరుపుతారు,” అని యమునోత్రి ఆలయ కమిటి ఎగ్జిక్యూటివ్​ సభ్యుడు పురుషోత్తమ్​ యూనియల్​ తెలిపారు.

Advertisement

ఇక బద్రినాథ్​ ధామ్​ పోర్టల్​.. మే 12 ఉదయం 6 గంటలకు ఓపెన్​ అవుతుంది. కేదార్​నాథ్​ పోర్టల్​.. మే 10 ఉదయం 7 గంటలకు ఓపెన్​ అవుతుంది.

Badrinath opening date 2024 : “మద్మేశ్వర ఆలయాన్ని తెరిచే విషయంపై ఏప్రిల్​ 13న నిర్ణయం తీసుకుంటాము. ఆ రోజు పవిత్ర వైశాకి పండుగ ఉంటుంది,” అని బద్రినాథ్​ కేదార్​నాథ్​ ఆలయ కమిటీ మీడియా ఇన్​ఛార్జ్​ హరీశ్​ గౌర్​ తెలిపారు.

సముద్రానికి 3140 మీటర్ల ఎత్తులో ఉంటుంది గంగోత్రి ధామ్​. భాగీరతి నదీ ఒడ్డు ఉంటుంది. హిందు సంప్రదాయం ప్రకారం.. స్వర్గం నుంచి గంగా తొలతు గంగోత్రిలో అడుగుపెట్టింది. అయితే.. ఈ నది ప్రారంభం.. గంగోత్రి నుంచి 19కి.మీల దూరంలోని గోముఖ్​ దగ్గర ఉంటుంది. గోముఖ్​ నుంచి ప్రవహించిన నీరు..దేవప్రయాగ వద్ద అలకనందను కలుస్తుంది. ఆ తర్వాతే.. దీనికి గంగా అని పేరు వస్తుంది.

Kedarnath opening date 2024 : యమునోత్రి ధామ్​.. సముద్రానికి 3,293 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్షయ తృతియ రోజు ఆలయం తెరుచుకుని.. దీపావలి నుంచి రెండో రోజు వచ్చే యమ ద్వీతియ నాడు మూసుకుంటుంది. గంగోత్రి-యమునోత్రి మధ్య దూరం 46 కి.మీలు.

ప్రతి యేటా.. 6 నెలలపాటు ఛార్​దామ్​ ఆలయాలు మూతపడి ఉంటాయి. ఏప్రిల్​ లేదా మేలో తెరుచుకుని.. శీతాకాలం (అక్టోబర్​ లేదా నవంబర్​)లో మూతపడతాయి.

Advertisement

ఛార్​దామ్​ యాత్రకు ప్రజల నుంచి స్పందన ప్రతియేటా పెరుగుతోంది. 2023లో 5.6 మిలియన్​ మంది అక్కడికి వెళ్లారు. ఇది ఒక రికార్డు. 2022లో ఈ సంఖ్య 4.6 మిలియన్​గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version