National

చాబహార్ పోర్టు ఒప్పందం వెనక ఏం జరిగింది.. దీంతో భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటి?

Published

on

India Iran Chabahar Port agreement: దేశమంతా లోక్‌సభ ఎన్నికల హడావిడిలో మునిగిఉన్న సమయంలో భారత్ ఇరాన్‌తో వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే ఉలిక్కిపడ్డట్టుగా అమెరికా స్పందించినప్పటికీ అసలు సిసలు షాక్ తిన్నది మాత్రం పాకిస్థాన్, చైనా.. ఆ రెండు దేశాలకు ఏకకాలంలో ఝలక్ ఇచ్చిన చాబహార్ పోర్టు ఒప్పందం వెనక ఏం జరిగింది..? అసలు చాబహార్ ఎక్కడ ఉంది..? ఈ ఒప్పందంతో భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటి..?

ఇరాన్‌తో కీలక ఒప్పందం
భారత్, ఇరాన్ చిరకాల మిత్ర దేశాలు. వాణిజ్య పరంగా, విదేశాంగవిధానం పరంగా రెండు దేశాలు వీలైనంత మేర సాయం చేసుకుంటుంటాయి. అయితే ఈ స్నేహబంధాన్ని బీటలు వారేలా చేసేందుకు పాకిస్థాన్, చైనా వీలయినంత మేర ప్రయత్నిస్తూనే ఉంటాయి. దీంతో మూడు, నాలుగేళ్లగా భారత్, ఇరాన్ మధ్య సంబంధ బాంధవ్యాలు అంత సజావుగా సాగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో భారత్‌.. ఇరాన్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుని పాకిస్థాన్, చైనాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజానికీ షాకిచ్చింది. అదే చాబహార్ ఒప్పందం. భారత్‌ నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కోలాహలంలో ఉన్న సమయంలో మన పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఇరాన్ వెళ్లి ఆ దేశ షిప్పింగ్ మంత్రితో కలిసి చాబహార్ పోర్టు నిర్వహణ ఒప్పందం కుదుర్చుకున్నారు.

పదేళ్ల పాటు అమల్లో ఒప్పందం
ఇరాన్‌లో తీర పట్టణమయిన చాబహార్ ఒమన్ గల్ఫ్ పక్కనే ఇది ఉంది. చాబహార్‌లోని షాహిద్ బెహస్తీ పోర్టు నిర్వహణకు సంబంధించి భారత్, ఇరాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిజానికి ఈ ఒప్పందం ఇప్పుడు కుదిరింది కాదు. 2016లోనే ఒప్పందం కుదిరింది. ఓ భారతీయ సంస్థ ఈ ఓడరేవు నిర్వహణ కూడా చేపట్టింది. అయితే అనేక అవాంతరాలను దాటుకుని ఇప్పుడు దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది . 2016 ఒప్పందానికి ఇది కొత్త వెర్షన్ అనుకోవాలి. ఇండియా పోర్ట్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, పోర్ట్స్ అండ్‌ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ పదేళ్ల పాటు చాబహార్ పోర్టు టెర్మినల్ నిర్వహణ బాధ్యత భారత్‌దే. విదేశాల్లో ఇలా పోర్టు నిర్వహణ పూర్తిస్థాయిలో భారత్ చేపట్టడం ఇదే తొలిసారి. పదేళ్ల తర్వాతా ఈ ఒప్పందం కొనసాగుతుంది. పోర్టు అభివృద్ధి, నిర్వహణ మొత్తం భారత్ చేతుల్లోనే ఉంటుంది.

దౌత్య ప్రయోజనాలకు అత్యంత కీలకం
ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ మీద ఉన్న వ్యతిరేకతతో అమెరికా అక్కసు వెళ్లగక్కింది కానీ నిజానికి షాక్ తిన్నంది పాకిస్థాన్, చైనా. ఎందుకుంటే చాబహార్ పోర్టు భారత్ ఆధీనంలో ఉంటే పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా ఇరాన్‌తోనూ, గల్ఫ్ దేశాలతోనూ, అఫ్ఘానిస్థాన్, ఇతర ఆసియా దేశాలతోనూ, యూరప్‌తోనూ వాణిజ్య సంబంధాల పరంగానూ, విదేశాంగ విధానం పరంగానూ మనదేశానికి సరికొత్త అవకాశాలు ఏర్పడతాయని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. మన వ్యూహాత్మక, దౌత్య ప్రయోజనాలకు ఇది అత్యంత కీలకం. అలాగే ఇరాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉండే గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. గ్వాదర్‌ పోర్టుకు చాబహార్‌తో చెక్‌పెట్టవచ్చు. భారత్, ఇరాన్, అఫ్ఘానిస్థాన్‌ను కలిపే చాబహార్ పోర్టు ఒప్పందంతో భారీ పెట్టుబడులకు మార్గం సుగమమయింది.

పాకిస్థాన్, చైనాకు చెక్
పాకిస్థాన్‌తో తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయి. ఈ ఒప్పందం వల్ల పాకిస్థాన్‌ భూభాగంతో పనిలేకుండా మధ్య ఆసియా, అఫ్ఘానిస్థాన్‌కు రవాణాకు వీలు కలుగుతుంది. అలాగే చైనా నిర్వహణలో ఉన్న పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టు చాబహార్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రమార్గంలో 100కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్వాదర్ పోర్టును చైనా నిర్వహించడం భారత్‌కు సమస్యాత్మకం. చాబహార్ పోర్టు నిర్వహణ ద్వారా ఒకేకాలంలో పాకిస్థాన్, చైనా ఆటలు కట్టించవచ్చు. చమురు, గ్యాస్ మార్కెట్లతో భారత్ సంబంధాలు మెరుగ్గా మారతాయి. అలాగే అఫ్ఘానిస్థాన్‌కు ఆహారధాన్యాల సరఫరా కోసం పాకిస్థాన్ రోడ్డు మార్గాన్ని భారత్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. పోర్టు నిర్వహణకు భారత్ 3వేల90కోట్లు వెచ్చించనుంది. భారత్, ఇరాన్ మధ్య చిరకాల మిత్రబంధం ఉండడంతో కొన్నాళ్లుగా పోర్టు నిర్వహణ ఒప్పందంలో విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరిగినప్పటికీ.. అందరికీ షాకిస్తూ.. రెండు దేశాలూ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

Advertisement

పాకిస్థాన్, చైనాకు చెక్
పాకిస్థాన్‌తో తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయి. ఈ ఒప్పందం వల్ల పాకిస్థాన్‌ భూభాగంతో పనిలేకుండా మధ్య ఆసియా, అఫ్ఘానిస్థాన్‌కు రవాణాకు వీలు కలుగుతుంది. అలాగే చైనా నిర్వహణలో ఉన్న పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టు చాబహార్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రమార్గంలో 100కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్వాదర్ పోర్టును చైనా నిర్వహించడం భారత్‌కు సమస్యాత్మకం. చాబహార్ పోర్టు నిర్వహణ ద్వారా ఒకేకాలంలో పాకిస్థాన్, చైనా ఆటలు కట్టించవచ్చు. చమురు, గ్యాస్ మార్కెట్లతో భారత్ సంబంధాలు మెరుగ్గా మారతాయి. అలాగే అఫ్ఘానిస్థాన్‌కు ఆహారధాన్యాల సరఫరా కోసం పాకిస్థాన్ రోడ్డు మార్గాన్ని భారత్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. పోర్టు నిర్వహణకు భారత్ 3వేల90కోట్లు వెచ్చించనుంది. భారత్, ఇరాన్ మధ్య చిరకాల మిత్రబంధం ఉండడంతో కొన్నాళ్లుగా పోర్టు నిర్వహణ ఒప్పందంలో విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరిగినప్పటికీ.. అందరికీ షాకిస్తూ.. రెండు దేశాలూ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

చాబహార్ పోర్టు ఎప్పుడూ చర్చనీయాంశమే!
భారత్, ఇరాన్ మధ్య చాబహార్ పోర్టు ఎప్పుడూ చర్చనీయాంశమే. ఎందుకంటే.. భారత్‌కు, యూరప్‌కు మధ్య ఇరాన్ ఓ బంగారు ద్వారం లాంటిదన్నది అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ. 2003లోనే ఈ ఒప్పందం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2016లో ప్రధాని మోదీ ఇరాన్ పర్యటన సమయంలో ఒప్పందం కుదిరింది. అయితే అంతర్జాతీయ పరిణామాలతో భారత్, ఇరాన్ మధ్య దూరం పెరిగిందని, దీంతో ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలిగిందని నాలుగేళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఇరాన్ వెనక్కి తగ్గడం వెనక చైనా హస్తముందన్న ఆరోపణలూ వచ్చాయి. కానీ తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం, ఇరాన్-అమెరికా విభేదాలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో భారత్ ఎలాంటి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా, ఎవరి హెచ్చరికలనూ లెక్కచేయకుండా చాబహార్ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుని షాకిచ్చింది.

ఆచితూచి వ్యవహరించిన ఇండియా
పోర్టుల నిర్వహణతో చైనా పొరుగు దేశాలపైనా, ఆసియా దేశాలపైనా ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 2016లో భారత్, ఇరాన్ మధ్య కుదిరిన చాబహార్ పోర్టు ఒప్పందాన్ని అడ్డుకునేందుకు తెరవెనక ప్రయత్నాలు చేసింది. భారత్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గుతోందన్న ఆరోపణలు చేసి ఇరాన్ మనసు మార్చే ప్రయత్నం చేసింది. అయితే భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరించింది. ఎక్కడా రెచ్చగొట్టే చర్యలకు దిగకుండా దౌత్యపరంగా సంయమనం పాటిస్తూ… అదను చూసి పూర్తిస్థాయిలో పోర్టు నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్‌కు చాబహార్ పోర్టు అత్యంత కీలకం. భారత్, ఇరాన్, అఫ్గానిస్థాన్, అర్మేనియా, అజర్ బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌ల మధ్య రవాణా కోసం 7వేల 200 కిలోమీటర్ల రైలు, రోడ్డు, సముద్రమార్గాల్లో నెట్‌వర్క్ ఏర్పరుచుకునేదే INSTC. భారత్‌ను యూరప్‌కు దగ్గర చేసే ఈ కారిడార్ నిర్మాణానికి చాబహార్ నిర్వహణ మన ఆధీనంలో ఉండడం అత్యవసరం. అందుకే ఏ ఒత్తిళ్లకూ భారత్ తలొగ్గలేదు. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలకు సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశప్రయోజనాల దృష్ట్యా అంతర్జాతీయ పరిణామాలను పక్కనపెట్టి ఒప్పందం కుదుర్చుకుంది.

ఈజీగా యూరప్‌కు ఎగుమతులు
చాబహార్ పోర్టు నిర్వహణ వల్ల ఎగుమతుల, దిగుమతుల ఆర్థిక భారం భారీగా తగ్గుతుంది. ఇరాన్, అఫ్ఘానిస్థాన్, మధ్య ఆసియా, రష్యా, యూరప్ వంటి దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులకయ్యే ఖర్చు తగ్గుతుంది. కేవలం రెండంటే రెండే రోజుల్లో భారత్ నుంచి ఎగుమతులు యూరప్‌కు చేరవేయచ్చు. అందుకే చాబహార్‌ను భారత్, యూరప్ మధ్య బంగారు ద్వారంగా భావిస్తారు. అందుకే ఈ ఒప్పందం విషయంలో భారత్ ఏ మాత్రం వెనకాలోచన చేయలేదు. అయితే.. ఒప్పందం పూర్తిస్థాయి అమలుకు ఇంత ఆలస్యం కావడానికి చైనాతో పాటు అమెరికా కారణమనే ఆరోపణలున్నాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల వల్ల ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చుకుని భారత్ ఒప్పందంపై అడుగు ముందుకేసింది.

Advertisement

అమెరికాపై భారత్ అసంతృప్తి
ఒప్పందం విషయంలో అమెరికా అనుసరించిన వైఖరిపై భారత్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేసింది. సాధారణంగా అమెరికా తమ శత్రువును మిగిలిన ప్రపంచమంతా శత్రువుగానే చూడాలన్న భావనతో ఉంటుంది. ఆ విధానంలోనే భారత్-ఇరాన్ ఒప్పందాన్ని తప్పుపట్టింది. ద్వైపాకిక్షక సంబంధాలపై సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ భారత్‌కు ఉన్నప్పటికీ తాము ఆంక్షలు విధించిన దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలూ ఆంక్షల చట్రంలో ఇరుక్కుంటాయని హెచ్చరించింది. విస్తృత ప్రయోజనాలున్న ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని భారత్ తీవ్రంగా బదులిచ్చింది. దీర్ఘకాలిక ఒప్పందం లేకపోతే.. పోర్టు నిర్వహణ, అభివృద్ధి సాధ్యం కాదని తేల్చిచెప్పడం ద్వారా అమెరికా ఆంక్షలను ఖాతరు చేయబోమని కుండబద్ధలు కొట్టి చెప్పింది భారత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version