National
కేంద్ర మంత్రికి సీటివ్వని ప్రయాణికులు.. ఈ సమాజం ఎటు పోతోంది?
తాజా వార్తలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం క్రీడలు చిత్రజ్యోతి నవ్య సంపాదకీయం బిజినెస్ రాజకీయం ఫోటోలు వీడియోలు రాశిఫలాలు
ePaper వెబ్ స్టోరీస్ IPL 2024 సాంకేతికం AP ఎన్నికలు 2024 లోక్‌సభ ఎన్నికలు 2024 ప్రవాస చదువు సాహిత్యం ప్రత్యేకం Live Tv ఓపెన్ హార్ట్ నేటి కార్టూన్ క్రైమ్ వార్తలు
HOME » NATIONAL » NIRMALA SITHARAMAN’
Delhi Metro: కేంద్ర మంత్రికి సీటివ్వని ప్రయాణికులు.. ఈ సమాజం ఎటు పోతోంది?
ఢిల్లీ: ఆమె ఓ కేంద్ర మంత్రి. సీనియర్ సిటిజన్, పైగా మహిళ. అలాంటి వ్యక్తికి మెట్రోలో ప్రయాణికులు సీటివ్వకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ఆమె మరెవరో కాదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman). ప్రయాణికులు సీటు ఇవ్వకపోవడంతో ఆమె నిల్చునే ప్రయాణం చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిర్మలా శనివారం ఢిల్లీ మెట్రోలో లక్ష్మీనగర్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె ప్రయాణికులతో ముచ్చటించారు. కేంద్ర మంత్రిని గమనించినా ప్రయాణికులెవ్వరూ ఆమె కూర్చోవడానికి సీటు ఇవ్వలేదు.
దీంతో ఆమె నిలబడే ప్రయాణించారు. సదరు వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మంత్రికి కనీసం గౌరవం ఇవ్వకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమాజం ఎటుపోతోందంటూ నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం.. ‘మంత్రి ఎక్కాల్సింది మెట్రో రైలు కాదు. ముంబయి లోకల్ రైళ్లు ఎక్కాలి. అక్కడ ఎదురవుతున్న సమస్యలను చూడాలి. పదేళ్ల అధికారంలో ఉండి ఏం చేశారో వారికే అర్థం అవుతుంది’ అంటూ మంత్రిని విమర్శిస్తున్నారు. ఇంకొందరు ఆమె సింప్లిసిటీని మెచ్చుకుంటుండగా, మరికొందరు ఎలక్షన్ స్టంట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.