Education
CBSE syllabus 2024 25 : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్- ఇక నుంచి కొత్త సిలబస్!
CBSE syllabus 2024 25 : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్! పలు తరగతుల సిలబస్‌ని మార్చాలని నిర్ణయించింది ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్జ్యుకేషన్ రీసెర్చ్). ఈ మేరకు.. 2024-25 విద్యా సంవత్సరంలో 3 నుంచి 6వ తరగతి వరకు సిలబస్, టెక్ట్స్బుక్స్ని ఛేంజ్ చేస్తుంది. ఇతర తరగతుల కరికులమ్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ విషయాన్ని.. సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్జ్యుకేషన్) స్పష్టం చేసింది.
“క్లాస్ 3 నుంచి క్లాస్ 6 వరకు సిలబస్, టెస్ట్బుక్స్ని మారుస్తున్నట్టు.. మార్చ్ 18న ఎన్సీఈఆర్టీ మాకు చెప్పింది. ఈ విషయాన్ని అన్ని సీబీఎస్ఈ అనుబంధ సంస్థలకు మేము స్పష్టం చేస్తున్నాము. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాము. ఈ కొత్త సిలబస్, టెక్ట్స్బుక్స్నే ఫాలో అవ్వాలని విద్యాసంస్థలకు సూచనలు చేస్తున్నాము,” అని సీబీఎస్ఈ వెల్లడించింది.
CBSE syllabus class 3 to class 6 : ఎన్సీఎఫ్-ఎస్ఈ 2023 (నేషనల్ కరికూలమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్జ్యుకేషన్)లో భాగంగా.. ఈ చర్యలు చేపట్టింది ఎన్సీఈఆర్టీ. 2020 నేషనల్ ఎడ్జ్యుకేషన్ పాలసీని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తోంది. అయితే.. అన్ని తరగతు సిలబస్‌ని మార్చే ఉద్దేశంలో ఎన్సీఈఆర్టీ లేదని ముందు నుంచే వార్తలు జోరుగా సాగాయి. అందుకు తగ్గట్టుగానే.. కేవలం 3 నుంచి 6 తరగతుల వరకు సిలబస్, టెక్ట్స్బుక్స్ని మార్చింది. మిగిలిన తరగతులు విద్యార్థులు.. ఇప్పుడున్న సిలబస్‌తోనే కంటిన్యూ అవుతారు.
ఎన్ఈపీ-2020లో భాగంగా.. స్కూల్ హెడ్స్- టీచర్స్‌కి ‘కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్’ని ఇవ్వాలని నిర్ణయించుకుంది సీబీఎస్ఈ. ఆర్ట్- ఇంటిగ్రేటెడ్ ఎడ్జ్యుకేషన్, ఎక్స్పరిమెంటల్ లర్నింగ్, ఫ్లెక్సిబులిటీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని, సంబంధిత అంశాలను స్కూళ్లల్లో అమలు చేయాలని విద్యాసంస్థలకు సూచించింది.
CBSE syllabus change : 2020లో క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు సిలబస్‌ని హేతుబద్ధీకరించింది ఎన్సీఈఆర్టీ. కొవిడ్ సంక్షోభం అనంతరం.. విద్యార్థులపై కంటెంట్ లోడ్‌ని, ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. ముఘల్ కోర్ట్లు, గుజరాత్ అల్లర్లు, కోల్డ్ వార్, ముఘల్ చరిత్ర, ఎమర్జెన్సీ, పీరియాడిక్ టేబుల్‌కు చెందిన ఛాప్టర్స్ని తొలగించింది. ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. చరిత్రనే చెరిపేస్తున్నారని అనేకమంది మండిపడ్డారు.