National

CBSE Board Results : సీబీఎస్ఈ బోర్డు ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. ఈ నెల 20లోపు ప్రకటించే ఛాన్స్..!

Published

on

CBSE Board Results : 2024 ఏడాదిలో దాదాపు 39 లక్షల మంది విద్యార్థులు తమ సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 20 తర్వాత ఫలితాలను ప్రకటిస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గతంలో ప్రకటించింది.

మే 20లోపు ఎప్పుడైనా ఫలితాలను ప్రకటించవచ్చని బోర్డు అధికారి ఒకరు సూచించారు. బోర్డు పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోందని తెలిపారు. ఫలితాలపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని సీబీఎస్‌ఈ డైరెక్టర్ (స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) డాక్టర్ బిశ్వజిత్ సాహా తెలిపారు.

ఫలితాల ప్రకటన ఎప్పుడు అనేది కచ్చితమైన తేదీపై వెల్లడించలేదు. మే 20, 2024 తర్వాత ఫలితాలు వెలువడతాయని భావిస్తున్నారు. ఫలితాలకు సంబంధించి ప్రక్రియ పూర్తి కాగా, ఏ క్షణమైన ఫలితాలను ప్రకటించవచ్చునని సాహా చెప్పారు. 10, 12వ తరగతులకు బోర్డు పరీక్షలు ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య నిర్వహించగా, 10వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి.

విద్యార్థులు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లు, బోర్డు పరీక్షలతో సహా అన్ని సబ్జెక్టులలో కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. ఫలితాలు విడుదలైన తర్వాత, విద్యార్థులు తమ లాగిన్ వివరాలనుఉపయోగించి సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లను విజిట్ చేయడం ద్వారా తమ అడ్మిట్ కార్డ్ ఐడీ, స్కూల్ నంబర్, రోల్ నంబర్‌ను ఎంటర్ చేసి స్కోర్‌కార్డ్‌లను యాక్సెస్ చేయొచ్చు. గత ఏడాదిలో సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు మే 12వ తేదీన అంటే.. రెండో శుక్రవారం వెల్లడి కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version