National
భారీ వర్షాలతో చిక్కుకుపోయిన పర్యటకులు- సిక్కింలో BRO రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్
Sikkim Rain Rescue Operation : భారీవర్షాల కారణంగా సిక్కింలో చిక్కుకుపోయిన పర్యటకుల తరలింపు ప్రక్రియ మొదలైంది. తొలి విడతలో 20మంది యాత్రికులను లాచుంగ్ నుంచి మంగన్‌కు తరలించారు. ఈనెల 12 నుంచి సిక్కింలో కురుస్తున్న మెరుపువర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈక్రమంలో దాదాపు 1500 మంది పర్యటకులు మంగన్ జిల్లా లాచుంగ్‌లో చిక్కుకుపోయారు. ప్రతికూల పరిస్థితుల మధ్య పెద్దఎత్తున వనరులను సమీకరించిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, తీస్తానదిపై తూంగ్ వద్ద వంతెన నిర్మాణం చేపట్టడం వల్ల చుంగ్‌థాంగ్, మంగన్ మధ్య రాకపోకలు మొదలయ్యాయి. BROకు స్థానిక యంత్రాంగంతోపాటు NDRF బృందాలు సహాయం అందించాయి. దీంతో చుంగ్‌థాంగ్‌లో చిక్కుకుపోయిన పర్యాటకుల్లో 200 మందిని మంగన్‌కు తీసుకొచ్చారు.