National

CAA అమలు వేగవంతం- రెండో విడతలో మూడు రాష్ట్రాల లబ్ధిదారులకు భారత పౌరసత్వం

Published

on

CAA Citizenship Certificates Issued : కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి బుధవారం రెండో విడతలో బంగాల్, హరియాణా, ఉత్తరాఖండ్‌లలో భారత పౌరసత్వం మంజూరైంది. ఈ మూడు రాష్ట్రాల్లోని దరఖాస్తుదారులకు సంబంధిత రాష్ట్ర సాధికార కమిటీ పౌరసత్వం మంజూరు చేసిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. సీఏఏ చట్టం కింద తొలి విడతలో మే 15న కొందరికి దిల్లీలో పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version