Hyderabad

బీఆర్ఎస్‌కు మరో షాక్‌ – కాంగ్రెస్​లోకి కేకే, హైదరాబాద్​ మేయర్ విజయలక్ష్మి – Kesavarao Join To Congress

Published

on

KK and Mayor Vijayalaxmi to Join Congress: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకొని, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్న తాను తిరిగి సొంత పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు బీఆర్ఎస్‌ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు తెలిపారు. బీఆర్ఎస్‌(BRS) అధినేత కేసీఆర్‌ను కలిసి పార్టీకి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. పార్టీ అంతర్గత అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని అన్నారు.

నగర అభివృద్ధి, అధికారులతో పనులు త్వరగా అవుతాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. అయితే తన వెంట కార్పొరేటర్లు ఎవరినీ తీసుకుపోవడం లేదని చెప్పారు. అటు కేశవరావు కుమారుడు, బీఆర్ఎస్‌ కార్యదర్శి విప్లవ్ కుమార్ మాత్రం తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన తండ్రి, సోదరి నిర్ణయాలతో సంబంధం లేదని, కేసీఆర్ నాయకత్వంపై పూర్తి నమ్మకంతో బీఆర్ఎస్‌లోనే ఉంటానని చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పలువురు కీలక నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. వీరిలో మొదటగా పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్‌ దంపతులు, సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version