Cinema

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపిన దుండగులు – Firing Outside Salman Khan Home

Published

on

Firing outside Salman Khan Home : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ ఆయన ఇంటి వద్ద ఇద్దరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.

ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో తమకు సమాచారం అందినట్లు పోలీసులు వెల్లడించారు. క్రైమ్​ బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం అక్కడికి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

గత ఏడాది మార్చిలో సల్మాన్‌ ఖాన్​ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు పలు ఈ మెయిల్స్‌ వచ్చాయి. అప్పుడు ముంబయి పోలీసులు విచారణ చేపట్టగా, అందులో గ్యాంగ్‌స్టర్లు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీ బ్రార్​ పేర్లు బయటకి వచ్చాయి. దీంతో ఆ ఇద్దరిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే ఓ విషయం బయటపడింది. ఈ గ్యాంగ్ టార్గెట్‌ చేసిన వాళ్ల లిస్ట్​లో సల్మాన్‌ పేరు ఉన్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసులోనూ లారెన్స్​ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.


అయితే కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ దెబ్బతీశారంటూ 2018లో లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. ఇక ఇదే విషయంపై సల్మాన్​కు మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

2023 ఏప్రిల్‌లోనూ సల్మాన్ ఖాన్​కు ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్​కు భారీ భద్రతను కల్పించింది. ‘ఎక్స్‌’ గ్రేడ్‌ ఉన్న సెక్యూరిటీని కాస్త ‘Y+’గా అప్‌గ్రేడ్‌ చేసింది. అంతే కాకుండా ఆయన కోసం ఇద్దరు సాయుధ గార్డులను సైతం ఏర్పాటు చేసింది. ఆ ఇద్దరూ అనునిత్యం సల్మాన్​ వెంట ఉండాలని ఆదేశించింది. అంతే కాకుండా బాంద్రా శివారులోని సల్మాన్‌ నివాసంతో పాటు ఆయన ఆఫీస్‌ వద్ద బయట భారీ ఎత్తున అభిమానులను గుమిగూడే అనుమతి లేదంటూ అధికారులు వెల్లడించారు. అలా సల్మాన్​కు రక్షణ కల్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version