Crime News

Biggest Jail in India: భారతదేశంలోని అతిపెద్ద సెంట్రల్ జైళ్లు ఏవో తెలుసా..? వాటి ప్రత్యేకత ఏంటంటే..

Published

on

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. 140 కోట్లకు పైగా జనాభాలో ఒకవైపు నేరాలు జరుగుతుండగా,మరోవైపు న్యాయం కోసం పోరాటాలు కూడా జరుగుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం, దేశంలో 1300 కంటే ఎక్కువ జైళ్లు ఉన్నాయి.నేరాలను అరికట్టడానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా జైలును చూస్తాం. భారతదేశంలో వివిధ రకాల జైళ్లు ఉన్నాయి. ప్రతి జైలు దాని పరిమాణం, ఖైదీలను ఉంచే సామర్థ్యాన్ని బట్టి విభిన్న లక్షణాలను కలిగి ఉంటుంది.

భారతదేశంలోని టాప్ 10 జైళ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1. తీహార్ జైలు..
ఢిల్లీలో ఉన్న తీహార్ జైలు భారతదేశంలోనే కాకుండా దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు క్యాంపస్. ఇది 1957లో స్థాపించబడింది. 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జైలు క్యాంపస్‌లో 9 సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. ఇందులో 5200 మంది ఖైదీలు ఉండగలరు.

2. ఎరవాడ సెంట్రల్ జైలు..

మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఎరవాడ సెంట్రల్ జైలు భారతదేశంలోని రెండవ అతిపెద్ద జైలు. ఇందులో చాలా మంది ఖైదీలు శిక్షను అనుభవిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ కూడా ఈ జైలు గోడల మధ్య బంధించబడడం గమనార్హం.ప్రస్తుతం 3600 మంది ఖైదీలకు వసతి ఉంది.

Advertisement

3. నైని సెంట్రల్ జైలు..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న నైని సెంట్రల్ జైలు భారతదేశంలోనే మూడవ అతిపెద్ద సెంట్రల్ జైలు, 237 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 3000 మంది ఖైదీలకు వసతి ఉంది.

4. పుజల్ సెంట్రల్ జైలు..

తమిళనాడులోని చెన్నైలో ఉన్న పుఝల్ సెంట్రల్ జైలు దేశంలోని అతిపెద్ద జైళ్లలో ఒకటి. ఇది 26 సెప్టెంబర్ 2006 నుండి పని చేస్తోంది. 211 ఎకరాలలో విస్తరించి ఉన్న జైలు క్యాంపస్‌లో 1,251 మంది రిమాండ్ ఖైదీలు, 1,250 మంది శిక్ష పడిన ఖైదీలు, 500 మంది మహిళా ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉంది.

5. వెల్లూరు సెంట్రల్ జైలు..

Advertisement

దేశంలోని అతిపెద్ద జైళ్లలో తమిళనాడులోని వెల్లూరు సెంట్రల్ జైలు కూడా ఒకటి. ఇది 1830లో స్థాపించబడింది. దీని క్యాంపస్ 153 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇది జిల్లాలో అతిపెద్దది. తమిళనాడులో రెండవది.

6. రాజమండ్రి సెంట్రల్ జైలు..

రాజమండ్రి సెంట్రల్ జైలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. 196 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సముదాయాన్ని 1864లో బ్రిటిష్ సామ్రాజ్యం జైలుగా మార్చింది. దీని తరువాత 1870 లో దీనికి సెంట్రల్ జైలు అని పేరు పెట్టారు.

7. పాటియాలా సెంట్రల్ జైలు..

పంజాబ్‌లోని పాటియాలాలో ఉన్న సెంట్రల్ జైలు కూడా దేశంలోని అతిపెద్ద జైళ్లలో ఒకటి. దీని క్యాంపస్ కూడా 110 కోట్లకు పైగా విస్తరించి ఉంది.

Advertisement

8. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు..

దేశంలోని పెద్ద జైళ్లలో కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరపన్న అగ్రహార సెంట్రల్ జైలు కూడా ఒకటి. ఈ సెంట్రల్ జైలు కూడా 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. కర్నాటకలో అతిపెద్ద జైలు హోదాను కలిగి ఉంది. ఇది 1997లో స్థాపించబడింది. 2,200 మంది సామర్థ్యం ఉన్నప్పటికీ, ప్రస్తుతం 5,000 మందికి పైగా ఖైదీలను కలిగి ఉంది.

9. అలీపూర్ సెంట్రల్ జైలు..

దేశంలోని టాప్ 10 జైళ్లలో పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్ సెంట్రల్ జైలు సముదాయం కూడా ఉంది. 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సెంట్రల్ జైలులో పెద్ద సంఖ్యలో ఖైదీలు నివసించారు. రాజకీయ ఖైదీలను ప్రత్యేకంగా ఇక్కడ ఉంచారు. ఫిబ్రవరి 20, 2019 నుండి ఇది జైలు నుండి మ్యూజియంగా మార్చబడింది.

10. గయా సెంట్రల్ జైలు..

Advertisement

1851 సంవత్సరంలో స్థాపించబడిన ఈ జిల్లా జైలు 1922లో సెంట్రల్ జైలుగా మార్చబడింది. బీహార్‌లోని గయా జిల్లాలో ఉన్న ఈ సెంట్రల్ జైలు కూడా దేశంలోని 10వ అతిపెద్ద జైళ్ల జాబితాలో చేర్చబడింది. దీని క్యాంపస్ 31 ఎకరాలలో విస్తరించి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version