National
వేసవి అయ్యేంత వరకు బెంగళూరు వెళ్లకండి
బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి వేధిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే ప్రజలు కూడా నీరు లేక అవసరాల కోసం వాష్‌రూమ్‌లను ఉపయోగించడానికి సమీపంలోని మాల్స్‌కు వెళ్తున్నారని అక్కడి ఓ నివాసితుడు తెలిపాడు. స్నానాల కోసమైతే ఏకంగా జిమ్‌లకు వెళ్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. సోషల్ మీడియా వెబ్‌సైట్ రెడ్డిట్ ద్వారా తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యను ఆ నివాసి తెలియజేశాడు. ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీలోని ఒక ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నట్లు పేర్కొన్న ఆ వ్యక్తి తమకు చుక్క నీరు రావడం లేదని వాపోయాడు. ఆ వ్యక్తి ఇంకా మాట్లాడుతూ.. అద్దె ఇళ్లల్లో ఉండే చాలా మంది తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారనీ తెలిపాడు. మరికొందరు తాత్కాలిక వసతికి మారారనీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. నీరులేక టాయిలెట్ల దుర్వాసనను మీరు చాలా దూరం నుండి పసిగట్టవచ్చనీ, కొంత మంది స్థానికులు ప్రతిరోజు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి సమీపంలోని ఫోరమ్ మాల్‌కు వెళ్లడం సర్వసాధారణమైపోయిందని ఆ వ్యక్తి తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.