Andhrapradesh

BEd Exams: మే 1 నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఈడీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

Published

on

అమరావతి, మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీల్లో బీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు మే 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను మార్చి 26వ విడుదల చేసింది. ఏప్రిల్‌ 3వ తేదీలోపు రెగ్యులర్‌ విద్యార్ధులు రూ.2130 పరీక్ష రుసుము చెల్లించాలి. మార్చి 4వ తేదీన రూ.100 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు. ఈ మేరకు ఏసీఏ రెడ్డి ప్రకాశరావు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. మరోవైపు మే 1వ తేదీన కార్మిక దినోత్సవం ఉన్నందున్న ఆ రోజు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని పలు విద్యార్ధి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇగ్నో ప్రవేశాల గడువు మార్చి 31 వరకు పెంపు
2024-25 విద్యా సంవత్సరానికి ఇగ్నో ప్రవేశాల గడువు మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు గాజువాక ఎంవీఆర్‌ డిగ్రీ కాలేజీ ఇగ్నో స్టడీ సెంటర్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌వీ కృష్ణ ఓ ప్రకటనలో వెల్లడించారు. సర్టిఫికెట్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, ఎంబీఏ వంటి అన్ని కోర్సులకు ఇదే తుది గడువుగా ఇగ్నో పేర్కొంది.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 అప్పీళ్లపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్సును సవాల్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన హైకోర్టు ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులు కోర్టుకు దాఖలు చేసిన పిటీషన్లను ఏప్రిల్‌ 18వ తేదీన విచారణకు వాయిదా వేసింది. ఇప్పటికే గ్రూప్‌ 1 (27/2018) కింద ఉద్యోగాలు చేసుకుంటున్న 167 మందిని కొలువుల నుంచి తొలగించవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువును కూడా ఏప్రిల్ 18వ తేదీ వరకు ధర్మాసనం పొడిగించింది. ఈ మేరకు కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version