Andhrapradesh

BC Declaration: టీడీపీ-జనసేన బీసీ డిక్లరేషన్ విడుదల – వారికి అదిరిపోయే హామీలు

Published

on

Chandrababu Naidu Pawan Kalyan releases BC declaration: బీసీల సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా తెలుగుదేశం – జనసేన పార్టీలు ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్‌ ను ప్రకటించాయి. మంగళగిరిలో జయహో బీసీ పేరుతో నిర్వహించిన వేదికపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ డిక్లరేషన్‌ ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ రూపొందించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు, కార్పొరేషన్, నామినేటెడ్‌ పదవులు, సబ్‌ప్లాన్‌ నిధులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేశారు.
బీసీ డిక్లరేషన్‌లోని అంశాలు

1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం.

2. ప్రత్యేక రక్షణ చట్టం: జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ‘ప్రత్యేక రక్షణచట్టం’ తీసుకొస్తాం. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం.

3. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.
ఎ) వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోనమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

4. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను వైసీపీ ప్రభుత్వం 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి, 16,800 పదవులు దూరం చేశారు. అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం.
ఎ) చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
బి) అన్ని సంస్థలు. నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్. ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం
సి) తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం.

Advertisement

5. పెన్షనను నెలకు రూ.4 వేలకు పెంచుతాం.
ఎ) జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
బి) దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.
సి) స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.
డి) జగన్రెడ్డి ‘ఆదరణ’ లాంటి 30 పథకాలు రద్దు చేశారు. రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పరికరాలిస్తాం.
ఈ) మండల/నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్,ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. ఎఫ్) జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తాం.

6. చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం

7. చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్ధరిస్తాం. పెళ్లికానుకలు రూ.లక్షకు పెంపు

8. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.

9. విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం
ఎ) నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం.
బి) షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.
సి) పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్దరిస్తాం.
డి) స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంబిస్తాం.

Advertisement

10.బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం.

బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాదు… బ్యాక్ బోన్ క్లాసెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version