Hashtag
బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్ చేయించి.. దాని మెడలో వేసిన వ్యక్తి
అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి తల్లీదండ్రులు బంగారు గొలుసులు చేయిస్తుండడం చూస్తూనే ఉంటాయి. ఓ వృద్ధుడు మాత్రం తన బర్రెకి బంగారు గొలుసు చేయించాడు. గొలుసు అంటే ఏదో రూ.10 వేలదో తులం బంగారంతోనో చేయించింది కాదు. 10 కిలోల బంగారంతో చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తన బర్రెకు గొలుసు తొడుగుతూ అతడు మురిసిపోయాడు. ఆ సమయంలో మరొకరు అతడికి సాయం చేశారు. మరో వ్యక్తి ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘మాషాల్లా.. ఆవుకి 10 కిలోల బంగారు గొలుసు. దాని ధర ఎంతో?’ అని పేర్కొన్నాడు.
అయితే, వీడియోలో ఉన్నది బర్రె అయితే పోస్ట్ చేసిన వ్యక్తి మాత్రం ఆవు అంటూ రాసుకురావడం నెటిజన్లను తికమకకు గురిచేస్తోంది. ఆవుగా భావించి బర్రెకు 10 కిలోల బంగారం చేయించారా ఏంటి? అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా పశువులకు అంత ఖర్చు చేసి బంగారు గొలుసులు చేయించడం ఏంటంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.