Business

Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో తెలుసా..?

Published

on

మే నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరో 5 రోజుల తర్వాత జూన్ నెల వస్తుంది. జూన్‌లో 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో, ఆదివారం, రెండవ, నాల్గవ శనివారం కారణంగా 6 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. పండుగల కారణంగా మిగిలిన రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. జూన్ నెలలో 10 బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవని గుర్తించుకోండి. కొ కొన్ని రాష్ట్రాలు మినహా భారతదేశంలోని అన్ని బ్యాంకులకు వర్తిస్తాయి.

జూన్ నెలలో సెలవులు తక్కువగా ఉండడంతో ఈసారి కస్టమర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకు సెలవు దినాలలో, మీరు ATM, నగదు డిపాజిట్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పని చేయవచ్చు. జూన్‌లో ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

జూన్ 2024లో రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవుల జాబితా:

జూన్ 2, 2024: ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
8 జూన్ 2024: రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
9 జూన్ 2024: ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు.
15 జూన్ 2024: YMA డే లేదా రాజా సంక్రాంతి కారణంగా భువనేశ్వర్, ఐజ్వాల్ జోన్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
16 జూన్ 2024: ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు.
17 జూన్ 2024: బక్రీ ఈద్ కారణంగా, దేశవ్యాప్తంగా దాదాపు బ్యాంకులు మూసివేయబడతాయి.
18 జూన్ 2024: బక్రీ ఈద్ కారణంగా జమ్ము మరియు శ్రీనగర్ జోన్‌లలో బ్యాంకులు బంద్‌.
22 జూన్ 2024: నాల్గవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు.
23 జూన్ 2024: ఆదివారం కారణంగా బ్యాంకులకు వారపు సెలవు.
30 జూన్ 2024: ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version