Business

Bank Holidays in May : మే నెలలో బ్యాంక్​లకు 10 రోజుల పాటు సెలవులు- పూర్తి లిస్ట్​ ఇదే..

Published

on

May 2024 Bank Holidays list : మే 2024కు సంబంధించిన బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని ఆర్​బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ప్రకటించింది. వివిధ మతపరమైన సెలవులు, వారాంతపు సెలవుల కారణంగా.. దేశవ్యాప్తంగా బ్యాంక్​లు.. మే నెలలో కనీసం 10 రోజుల పాటు సెలవులు తీసుకోనున్నాయి.

ముఖ్యంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తో సహా అన్ని జాతీయ బ్యాంకులు.. 2024 మేలో కనీసం 10 రోజుల పాటు పని చేయవమని కస్టమర్లు గుర్తుపెట్టుకోవాలి. వీటిలో రెండు- నాలుగు శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు ప్రాంతీయ పండుగలకు సెలవులు కూడా ఉండవచ్చు. అందుకే.. బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం ఉత్తమం. చివరి నిమిషంలో అసౌకర్యాలను నివారించడానికి మీరు బ్యాంక్​ సెలవుల లిస్ట్​ని తెలుసుకోవాల్సి ఉంటుంది.

Bank Holidays in May : బ్యాంకుల హాలిడే క్యాలెండర్​ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. వివిధ రాష్ట్రాల స్థానిక ఆచారాలను బట్టి బ్యాంకుల ప్రాంతీయ సెలవులు మారుతూ ఉంటాయి.

మే 2024 లో బ్యాంక్​ సెలవుల పూర్తి జాబితా..
మే 1 బ్యాంక్ సెలవు: మే డే / లేబర్ డే, మహారాష్ట్ర డే కారణంగా దేశవ్యాప్తంగా.. మహారాష్ట్రలో బ్యాంకులు మూతపడి ఉంటాయి.

మే 8న బ్యాంకులకు సెలవు: బహుముఖ ప్రజ్ఞాశాలి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం సందర్భంగా.. పశ్చిమ్​ బెంగాల్​లో బ్యాంకులకు సెలవు.

Advertisement

మే 10 బ్యాంకు సెలవు: అక్షయ తృతీయ పండుగ కారణంగా బ్యాంకులకు సెలవు.

2024 Bank holidays list : మే 23 బ్యాంకు సెలవు: బుద్ధ పూర్ణిమ సందర్భంగా బ్యాంకులకు సెలవు.

ఇతర సెలవులు..
రెండో శనివారం బ్యాంకులకు సెలవు: మే 11

నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు: మే 25

ఆదివారం బ్యాంకులకు సెలవు: మే 4, 12, 18, 26

Advertisement

బ్యాంక్​ సెలవులు ఉన్నా.. ఇవి పనిచేస్తాయి!
Telangana Bank holidays in May 2024 : ఆన్​లైన్ బ్యాంకింగ్ సేవలు అన్ని బ్యాంకు సెలవుల్లో, వారాంతాల్లో అంతరాయం లేకుండా పనిచేస్తాయి. అత్యవసర లావాదేవీల కోసం ఖాతాదారులు బ్యాంకుల వెబ్​సైట్​లు, మొబైల్ యాప్​లు లేదా ఏటిఎంలను ఉపయోగించి తమ బ్యాంకింగ్ పనులను సౌకర్యవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ఏదేమైనా.. బ్యాంకు సిబ్బంది నుంచి సహాయం అవసరమైతే మాత్రం.. బ్యాంక్ హాలిడే షెడ్యూల్ గురించి తెలుసుకోవడం ముఖ్యం. తదనుగుణంగా సందర్శనలను ప్లాన్ చేయడం చాలా అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version