Business
Bank Account: ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి?
RBI: డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగాయని చెప్పొచ్చు. దీంట్లో బ్యాంక్ అకౌంట్ అనేది అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ చేసేందుకు, ఆన్‌లైన్‌లో కొన్ని అవసరాల కోసం, డబ్బుల్ని నిల్వ చేసేందుకు బ్యాంక్ అకౌంట్ అనేది కచ్చితంగా ఉండితీరుతుంది. ఈ క్రమంలోనే ఇప్పట్లో ఒక బ్యాంక్ అకౌంట్‌తో ఆగట్లేదు. చాలా మంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటున్నాయి. ఇక అందరికంటే ఎక్కువగా ఉద్యోగం చేసే వారు.. ప్రైవేట్ ఆఫీసుల్లో పని చేసే వారు.. కొత్తగా ఏదైనా కంపెనీలో చేరితే.. సాలరీ అకౌంట్ కోసం సెపరేట్‌గా అకౌంట్స్ తెరవాల్సి ఉంటుంది.
అయితే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం మంచిదేనా? అసలు ఒక వ్యక్తి దగ్గర గరిష్టంగా ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూల్స్ ఎలా ఉంటాయి. అనే వివరాలు మనం ఇప్పుడు చూద్దాం.
చాలా మంది దాదాపు 3 నుంచి 4 సేవింగ్స్ అకౌంట్లు వినియోగిస్తున్నారు. ఇంకొందరికి ఇంకా ఎక్కువ బ్యాంక్ ఖాతాలే ఉంటాయి. ఎందుకంటే మన దేశంలో నిర్దిష్టంగా ఇన్నే అకౌంట్లు ఉండాలనే పరిమితి ఏం లేదు. బ్యాంక్ అకౌంట్స్ సంఖ్యపై ఆర్బీఐ పరిమితి విధించలేదు. అందువల్ల ఒక వ్యక్తి ఎన్ని అకౌంట్లయినా తెరిచే వీలుంటుంది.
మీ అకౌంట్ల నుంచి చెల్లుబాటయ్యే ట్రాన్సాక్షన్లను కొనసాగించినంత వరకు ఎలాంటి హాని లేదా ఇబ్బందులు ఉండవు. ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉండటం వల్ల నష్టం ఏంటంటే.. అన్నింటినీ ఉపయోగించలేం. ఎక్కువ రోజులు బ్యాంక్ అకౌంట్ వాడకుంటే.. ట్రాన్సాక్షన్స్ చేయకుంటే.. అది నిరుపయోగంగా (ఇనాక్టివ్) మారే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా.. చాలా అకౌంట్లు ఉండటం వల్ల రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం.. ఆయా అకౌంట్లలో కచ్చితంగా మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి.
ఆయా బ్యాంకులు తమ సర్వీసులపై ఛార్జీల్ని వసూలు చేస్తుంటాయి. మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు, ఏటీఎం ఛార్జీలు, పాస్‌బుక్, చెక్ బుక్, SMS ఛార్జీలు ఇలా చాలానే ఉంటాయి. బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తున్నట్లయితే.. అప్పుడు ఆ ఖాతా సరిగా నిర్వహించవచ్చు. ఇతర ఛార్జీల బారి నుంచి తప్పించుకునేందుకు.. అవసరమైన అకౌంట్లు మాత్రమే ఉంచడం మేలు.