Andhrapradesh
Back Skating : వెనక్కు స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఇదిగో వీడియో
ప్రతిష్ఠాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను ఓ క్లబ్ సొంతం చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఒక వ్యక్తి ఇన్‌లైన్ స్కేట్లపై వెనక్కు ప్రయాణిస్తున్నాడు. ఈ వెనుకకు వెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటకకు చెందిన క్లబ్ ఇన్ లైన్ స్కేట్లలో వేగవంతంగా 100 మీటర్ల వెనుకకు వెళ్లిన బిరుదును పొందింది.
శివగంగ.. ఆర్ఎస్సీ (రోలర్ స్కేటింగ్ క్లబ్) సభ్యుడు 100 మీటర్లు వెనక్కు స్కేటింగ్ పూర్తి చేయడానికి కేవలం 14.84 సెకన్లు మాత్రమే పట్టిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోను పంచుకుంది. ఈ క్లబ్ కర్ణాటకలోని బెల్గాంలో ఉందని సంస్థ తన బ్లాగ్ లో పేర్కొంది. ఈ ఏడాది మే 27న ఈ రికార్డు సృష్టించింది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి సాధారణ పద్ధతిలో రోలర్ స్కేటింగ్ ప్రారంభించాడు. కానీ అకస్మాత్తుగా తన దిశను మార్చుకుని వెనుకకు స్కేటింగ్ చేయడం ప్రారంభించాడు. చాలా వేగంతో వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ‘దిల్ సే సెల్యూట్’ అంటూ కర్ణాటక క్లబ్ సభ్యుడు అంటూ కామెంట్లు వస్తున్నాయి.
షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోను 3.1 లక్షల మంది వీక్షించగా, 8,100 మంది లైక్ చేశారు. ఈ షేర్ పై ప్రజలు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫీట్ చూసి కొందరు ఆశ్చర్యపోగా, మరికొందరు ఇది ప్రమాదకరంగా కనిపిస్తోందని అంటున్నారు.
ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు అతడి స్కేటింగ్ ప్రతిభకి ఆశ్చర్యపోతున్నారు. వీడియోగ్రాఫర్ వేగంగా ఉండటం అతన్ని విజేతగా చేస్తుందని ఒకరు వ్యాఖ్యానించారు. వీడియోగ్రాఫర్ బహుశా వాహనాన్ని ఉపయోగిస్తున్నాడని ఒక వ్యక్తి చమత్కరింగా కామెంట్ చేశాడు.