Cinema

Baahubali: మరో బాహుబలి వస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..

Published

on

బాహుబలి.. తెలుగు సినిమా ఖ్యాతిని మార్చింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహులి 1, బాహుబలి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టించాయి. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఈ సినిమాతో హాలీవుడ్ సైతం తెలుగు చిత్రాలపై ప్రశంసలు కురిపించింది. ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూసేలా చేశాడు డైరెక్టర్ జక్కన్న. ఈ రెండు చిత్రాల తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో రూపొందించిన అన్ని చిత్రాలకు సౌత్, నార్త్ లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్స్ బద్దలుకొట్టాయి. రూ. 1000 కోట్ల మార్క్ సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలిచింది. డైరెక్టర్ రాజమౌళి మేకింగ్ హాలీవుడ్ మేకర్స్ దృష్టిని సైతం ఆకర్షించింది. ఇక ఇందులో ప్రభాస్, అనుష్క, రానా పాత్రలను జక్కన్న ఇంట్రడ్యూస్ చేసిన తీరు అందరిని కట్టిపడేసింది. ఈ మూవీలో నటీనటులు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు సినీ క్రిటిక్స్.

ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో బాహుబలి 1, 2 చిత్రాలు చాలా ప్రత్యేకం. అలాగే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఆ రేంజ్ మూవీ రాలేదు. అయితే ఇప్పుడు బాహుబలి మళ్లీ వస్తుంది. అంటే రీరిలీజ్ అవుతుందని కాదు.. ఈసారి బాహుబలి యానిమేషన్ వస్తుంది. ఈ పేరుతోనే యానిమేటెడ్ సిరీస్ తీసుకువస్తున్నారు. బహుబలి.. ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ రాజమౌళి ప్రకటించారు. త్వరలోనే ట్రైలర్ రానుందంటూ ట్వీట్ చేశాడు. “అతడి పేరును మాహిష్మతి ప్రజలు జపిస్తుంటే.. తిరిగి రాకుండా ప్రపంచంలో అతడిని ఏ శక్తి అడ్డుకోలేదు. యానిమేటెడ్ సిరీస్ బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ త్వరలో రానుంది” అంటూ రాసుకొచ్చారు జక్కన్న.


ఇక ఈ యానిమేటెడ్ సిరీస్ గురించి ఇతర వివరాలను ప్రకటించలేదు. ట్రైలర్ రిలీజ్ చేశాక మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈయానిమేటేడ్ సిరీస్ ను థియేటర్లలో రిలీజ్ చేస్తారా ? లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారా ? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబు కొత్త ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version