National

Ashwini vaishnaw: మైక్రోసాఫ్ట్‌తో సంప్రదించాం.. సర్వర్ల అంతరాయంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

Published

on

ప్రముఖ టెక్‌ దిగ్గం మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్ంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వినామానాలు మొదలు బ్యాంక్‌లు, స్టాక్‌ మార్కెట్స్‌, సూపర్‌ మార్కెట్స్‌ వరకు పలు రంగాలకు అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది విండోస్‌ యూజర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్‌ డెత్‌ అనే ఎర్రర్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు.

కాగా మైక్రోసాఫ్ట్ సర్వర్‌ అంతరాయం కారణంగా భారత్‌లోనూ పలు రంగాలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ అంతరాయాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ అంతరాయానికి కారణం ఏంటో గుర్తించారు. సమస్య పరిష్కారానికి కూడా ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి తెలిపారు. అలాగే సమస్య పరిష్కారానికి కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (CERT) మైక్రోసాఫ్ట్‌కు పలు కీలక సూచనలు చేసినట్లు మంత్రి ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.


అలాగే ఈ అంతరాయం నేషనల్ ఇన్ఫార్మాటిక్స్‌ సెంటర్‌పై (NIC) ఎలాంటి ప్రభావం చూపలేదని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌ఐసీ అనేది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) నెట్‌వర్క్, ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లాలకు సేవలను అందించే కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌. దీనిపై ఎలాంటి ప్రభావం పడలేదు. దీంతో భారత్‌లో ప్రభుత్వ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం లేనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే భారత దేశంలో విస్తారా, ఇండిగో, స్పైస్‌జెట్, అకాసా వంటి విమానాయన సంస్థలపై ఈ అంతరాయం తీవ్ర ప్రభావం చూపుతోంది. చెన్‌ ఇన్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. విమానయాన సంస్థలు ప్రస్తుతం ప్రయాణికులకు మాన్యువల్‌గానే టికెట్లను జారీ చేస్తున్నాయి. కాగా అంతరాయంపై మైక్రోసాఫ్ట్‌ సైతం అధికారికంగా ప్రకటించింది. నిరంతరం సేవలను మెరుగుపరుస్తున్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. సమస్యను సరిదిద్దేందుకు అనేక బృందాలు పని చేస్తున్నాయని, ఇందుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version