National
Arun Goel Resigns: కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
Election Commissioner Arun Goel Resigns: భారత ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి రానుంది.
భారత ఎన్నికల కమిషనర్ లలో ఒకరైన అరుణ్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు 2024కు కొన్ని రోజుల ముందు ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో తక్షణమే ఇది అమలులోకి వస్తుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. 2027 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాతో ఇప్పుడు కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే బాధ్యతలు నిర్వర్తించనున్నారు.