Andhrapradesh

APPSC DyEO Merit List: ఏపీపీఎస్సీ డిప్యూటీ ఈవో పోస్టులకు 1:100 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడి

Published

on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 38 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ వెలువరించగా తాజాగా నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెలువరించింది. 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేసింది. మొత్తం 3,957 మంది అభ్యర్ధులు మెయిన్‌ పరీక్షకు ఎంపికయ్యారు. మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీ లాసెట్ 2024 ఫలితాల్లో టాపర్లు వీరే..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్, పీజీ లా సెట్‌ ఫలితాలు గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. లాసెట్‌ ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ వరప్రసాదమూర్తి విడుదల చేశారు. మొత్తం 19,224 మంది అభ్యర్ధులు పరీక్ష రాయగా.. వీరిలో 17,117 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ తెలిపారు. తాజా ఫలితాల్లో మూడేళ్ల లా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్‌ పరీక్షలో తిరుపతి జిల్లాకు చెందిన యామల కృష్ణ చైతన్య 104 మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన హర్షవర్ధన్‌ రాజు 103లతో రెండో ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన రేవంత్‌రాయ్‌ 98 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.

ఇక ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన పీజీలాసెట్‌ విజయనగరం జిల్లాకు చెందిన కుసుమ అగర్వాల్‌ 92 మార్కులతో తొలి ర్యాంకు, తెలంగాణలోని మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన విజయనందిని 91 మార్కులతో సెకండ్‌ ర్యాంకు, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన విజయ ఆదిత్య 88 మార్కులతో థార్డ్‌ ర్యాంకు సాధించారు. రెండేళ్ల పీజీ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన అభినీత్‌ జాసన్‌ 96 మార్కులతో తొలి ర్యాంకు, గుంటూరు జిల్లాకు చెందిన నూకల దీప్తి 95 మార్కులతో రెండో ర్యాంకు, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన నువ్వుల జాహ్నవి 94 మార్కులతో మూడో ర్యాంకులు సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version