Andhrapradesh
AP SSC Results 2024 Live : ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు – తాజా అప్డేట్స్
AP SSC Results 2024 Live News Updates : ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు (AP SSC Results) విడుదల కానున్నాయి. 6 లక్షల మందికిపైగా విద్యార్థులు రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలను HT తెలుగుతో పాటు SSC బోర్డు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. తాజా లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి….
గతేడాది 72.26 శాతం ఉత్తీర్ణత
గతేడాది ఫలితాలను చూస్తే… పదో తరగతి పరీక్షల్లో 72.26 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఫలితాల్లో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ పరీక్షల్లో బాలికలే పైచేయి సాధించారు.
ఏపీ SSC బోర్డు సైట్ లో ఫలితాలు
పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
మే ఫస్ట్ వీక్ లో తెలంగాణ ఫలితాలు..!
త్వరలోనే తెలంగాణ పదో తరగతి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మే ఫస్ట్ వీక్ లో వచ్చే అవకాశం ఉందని సమాచారం.
సర్వం సిద్ధం…
పదోతరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ విజయవాడలో ఉదయం 11 గంటలకు ఏపీ విద్యా కమిషనర్ సురేశ్‌కుమార్ ఫలితాలను ప్రకటిస్తారు.