Andhrapradesh
AP SSC hall tickets: పదో తరగతి హాల్ టికెట్ల విడుదల
AP లో 10వ తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లను విడుదల చేసారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అధికారిక వెబ్ సైట్ లోhttps://bse.ap.gov.in/ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 18 నుండి 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.
పదో తరగతి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు విద్యార్ధులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి పదో తరగతి పరీక్షల లింక్ పై క్లిక్ చేయాలి. అనంతరం యూజర్ ఐడీగా స్కూల్ కోడ్ ను, పాస్ వర్డ్ గా స్కూల్ కు ఇచ్చిన కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్ట్రీమ్, జిల్లా, స్కూల్ పేరు, విద్యార్ధి పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను తప్పనిసరిగా ప్రింట్ అవుట్ తీసుకుని ఉంచుకోవాలి. పరీక్షలకు వీటిని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.