Andhrapradesh

AP News: ఏపీ విద్యార్ధులకు శుభవార్త.. వేసవి సెలవులు పొడిగింపు.! వివరాలు ఇవిగో

Published

on

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర విద్యాశాఖ. వేసవి సెలవులను మరో రోజు పొడిగిస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్న ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్స్ అన్ని కూడా జూన్ 12వ తేదీ.. బుధవారం తిరిగి రీ-ఓపెన్ కానున్నాయి. అయితే ఇప్పుడు ఒక రోజు పొడిగింపుతో గురువారం నుంచి ఏపీలో పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జూన్ 12న ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి తాము హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతో.. విద్యాశాఖ ఈ ప్రతిపాదనను పరిశీలించి.. పాఠశాలల పునః ప్రారంభాన్ని ఒకరోజు వాయిదా వేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను జూన్ 13న అనగా గురువారం నుంచి ప్రారంభించాల్సిందిగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రారంభించాల్సిందిగా విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జూన్ 12, ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ పార్టీ నుంచి కీలక నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే అధికారులు ఈ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. టీడీపీ 135, బీజేపీ 8, జనసేన 21 గెలుచుకున్నాయి. ఇక ఎంపీ స్థానాల్లో టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 గెలిచాయి. అటు వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version