Andhrapradesh

AP News: పర్యాటక కేంద్రంలో మరొక ఎయిర్ పోర్ట్…భూములను పరిశీలించిన కలెక్టర్..

Published

on

ఏపిలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.. దీనితో పాటు మరొక విమానాశ్రయం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఇది ఎక్కడా అనుకుంటున్నారా.. ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద దీన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి.

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది. విజయపురి సౌత్ పరిధిలో 1800 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే అక్కడ ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఫ్లైటెక్ ఏవియేషన్ సంస్థ శిక్షణా విమానాలను ఇక్కడ నుండే నడుపుతోంది. ప్రభుత్వం నిర్ణయంతో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ విజయపురి సౌత్ లో పర్యటించారు. ప్లైటెక్ ఏవియేషన్ సంస్థకు వెళ్లారు. అక్కడ యజమాని మమతతో మాట్లాడారు. అనంతరం ఆ సమీపంలో ఉన్న భూములను పరిశీలించారు. దీంతో విమానాశ్రయ నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నట్లు చర్చ నడుస్తోంది.

నాగార్జున సాగర్ వద్ద విమానాశ్రయ నిర్మాణంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ అతి పెద్ద పర్యాటక కేంద్రంగా కూడా ఉంది. రెండు రాష్ట్రాల సరిహద్దులో నిర్మితమయ్యే ఎయిర్ పోర్టు.. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య ఉండటంతో పాటు రెండు రాష్ట్రాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందన్న భావన వ్యక్తం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version