Andhrapradesh
AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు-శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్ జీఏడీకి అటాచ్
AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్రంలోని కీలక శాఖల్లో పనిచేస్తోన్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది. వారిని జీఏడీ అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, మురళీధర్ రెడ్డిలను జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్ ల బదిలీలు
పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ గా పనిచేసిన శ్రీలక్ష్మికి ఇటీవల పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. శ్రీలక్ష్మి తెచ్చిన ఫైల్ పై సంతకం పెట్టేందుకు మంత్రి నారాయణ నిరాకరించారు. ఇప్పుడు ఫైళ్లపై సంతకాల వంటివేం వద్దని వారించారు. శ్రీలక్ష్మి తెచ్చిన ఫైల్ ను తిప్పి పంపారు. శ్రీలక్ష్మిని తన పేషీ నుంచి బయటకు పంపారు సీఎం చంద్రబాబు. శ్రీలక్ష్మి నుంచి బొకే తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారు. జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు సైతం ఆదేశించారు. శ్రీలక్ష్మిని బదిలీ చేసేవరకు ఆమెకు ఫైళ్లు పంపకూడదని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెను సీఎస్ బదిలీ చేశారు. శ్రీలక్ష్మి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు.