Andhrapradesh

AP Half Day Schools : ఏపీలో ఒంటిపూట బడులు, ఆ డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

Published

on

AP Half Day Schools : మార్చి మొదటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఏపీ, తెలంగాణలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఏపీలో మార్చి 18 ఒంటి పూట బడులు నిర్వహించనున్నారని సమాచారం.

మార్చి మొదటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఏపీ, తెలంగాణలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకుండా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. (Twitter)

మార్చి 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. అలాగే ఏపీలో మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభిస్తారని సమాచారం. మార్చి 18వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని అధికారులు అంటున్నారు.

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో వీలైనంత త్వరగా ఒంటిపూట బడులు నిర్వహించాలని పిల్లలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన రాలేదు.

మార్చి 18 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు మొదలు కానున్నాయని తెలుస్తోంది. అయితే అన్ని పాఠశాలకు ఒంటి పూట బడులు అమలు చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు.
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మంచి నీరు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పాటు పాఠశాలల్లో ఫ్యాన్లు ఉండాలని, వాటి నిర్వహణ సరిగ్గా ఉండాలని విద్యాశాఖ ఆదేశించింది.

ఒంటి పూటల బడుల సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version