Andhrapradesh

AP Group 1 Results : ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల – మెయిన్స్‌కు ఎంతమంది అర్హత సాధించారంటే..?

Published

on

APPSC Group 1 Prelims Results: ఏపీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్(APPSC Group 1 Prelims) ఫలితాలను వెల్లడించింది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. శుక్రవారం రాత్రి తర్వాత ఫలితాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. గత నెల మార్చి 17వ తేదీన ఈ ఎగ్జామ్ జరగా…. 4,496 మంది మెయిన్స్‌కు(AP Group 1 Mains) అర్హత సాధించారు. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ నోటిఫికేషన్ లో భాగంగా… మొత్తం 81 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది ఏపీపీఎస్సీ. సెప్టెంబర్ మాసంలో మెయిన్స్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ప్రాథమిక కీ (Group 1 Key)మార్చి 18న కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆన్‌లైన్ ద్వారా మూడు రోజుల పాటు మార్చి 19 నుంచి మార్చి 21 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించింది. ఆ తర్వాత ఫైనల్ కీతో పాటు ఫలితాలను ప్రకటించింది. https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని కమిషన్ సూచించింది.

How To Check AP Group 1 Prelims Results : ఇలా చెక్ చేసుకోండి

  1. ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://portal-psc.ap.gov.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో కనిపించే Result Notification for the post of Group-I Services అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ కనిపించే Provisionally qualified candidates list for mains examination అనే ఆప్షన్ పై క్లిక్ చేసే మీకు పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మెయిన్స్ కు అర్హత సాధించిన వారి హాల్ టికెట్ నెంబర్లు డిస్ ప్లే అవుతాయి.
  4. Rejections list అనే మరో ఆప్షన్ ఉంది. దీనిపై క్లిక్ చేస్తే…. తిరస్కరణకు గురైన అభ్యర్థుల హాల్ టికెట్లు కనిపిస్తాయి.

ఏపీ గ్రూప్ 1 ఖాళీల వివరాలు

  • డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు-9
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌-18
  • డీఎస్పీ (సివిల్‌)- 26
  • రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌-6
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు-5
  • జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌- 4
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్స్- 3
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌- 2
  • జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌- 1
  • జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-1
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II-1
  • ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌- 1

APPSC Group 2 Prelims Results : మరోవైపు ఇటీవలనే ఏపీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను(APPSC Group 2 Prelims) ఏపీపీఎస్సీ ప్రకటించింది. మెయిన్స్(Group 2 Mains) కు క్వాలి ఫై అయిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default.aspx లో ప్రకటించింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాలతో 2557 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)899 గ్రూప్-2 పోస్టులకు ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్షను(APPSC Group 2 Prelims) నిర్వహించింది. గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్ కు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 4,63,517 మంది హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 4,04,037 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షకు 87.17% శాతం మంది హాజరయ్యారని ఏపీపీఎస్సీ (APPSC)తెలిపింది. ఏపీలోని 24 జిల్లాల్లోని 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version