Andhrapradesh

ఏపీ ఫైనల్ రిజల్ట్స్.. కూటమికి, వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

Published

on

AP Election 2024 Results : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్నదానిపై ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన చేసింది. ఎన్డీయే కూటమిలోని టీడీపీ 144 సీట్లలో పోటీ చేసి 135 స్థానాల్లో గెలిచింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా 21 సీట్లను కైవసం చేసుకుంది. ఇక, బీజేపీ 10 సీట్లలో పోటీ చేయగా.. 8 చోట్ల గెలుపొందింది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ.. ఈసారి 11 సీట్లకే పరిమితమైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.

వైసీపీ గెలిచిన అసెంబ్లీ స్థానాలు ఇవే..
1. పులివెందుల – జగన్
2. పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
3. బద్వేల్ – దాసరి సుధ
4. మంత్రాలయం – బాలనాగిరెడ్డి
5. ఆలూరు – బూసినే విరూపాక్షి
6. దర్శి – శివప్రసాద్
7. యర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్
8. అరకు – రేగం మత్స్యలింగం
9. పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
10. రాజంపేట – ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
11. తంబళ్లపల్లి – పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

పార్లమెంట్ తుది ఫలితాలు ఇలా..
ఇక ఏపీ లోక్ సభ ఎన్నికల్లో తుది ఫలితం ఇలా ఉంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకుగాను టీడీపీ 16, వైసీపీ 4, బీజేపీ 3, జనసేన 2 సీట్లను కైవసం చేసుకున్నాయి. గత ఎన్నికల్లో 22 సీట్లు గెలుచుకున్న వైసీపీ.. ఈసారి కూటమి సునామీలో కొట్టుకుపోయింది. కడప, రాజంపేట, తిరుపతి, అరకు లోక్ సభ నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.

వైసీపీ గెలిచిన ఎంపీ స్థానాలు..
అరకు – గుమ్మ తనుజా రాణి
కడప – వైఎస్ అవినాశ్ రెడ్డి
తిరుపతి – గురుమూర్తి
రాజంపేట – మిథున్ రెడ్డి

టీడీపీ..
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
విజయనగరం – అప్పలనాయుడు కలిశెట్టి
విశాఖ – శ్రీభరత్
అమలాపురం – హరీశ్
ఏలూరు – పుట్టా మహేశ్ కుమార్
విజయవాడ – కేశినేని చిన్ని
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల – కృష్ణ ప్రసాద్ తెన్నేటి
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి
నంద్యాల – బైరెడ్డి శబరి
కర్నూలు – నాగరాజు పంచలింగాల
అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ
హిందూపురం – పార్థసారథి
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద రావ్

Advertisement

జనసేన..
కాకినాడ – ఉదయ్ శ్రీనివాస్
మచిలీపట్నం – బాలశౌరి వల్లభనేని

బీజేపీ..
అనకాపల్లి – సీఎం రమేశ్
రాజమండ్రి – దగ్గుబాటి పురంధేశ్వరి
నర్సాపురం – భూపతి రాజు శ్రీనివాస వర్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version