Andhrapradesh

Ap Elections 2024 : ఏపీలో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. అక్రమాలు జరగకుండా ఈసీ గట్టి నిఘా

Published

on

Ap Elections 2024 : ఏపీలో ఎన్నికల నిర్వహణ సాఫీగా, పకడ్బందీగా, శాంతియుతంగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అక్రమాలు జరక్కుండా నిఘా పెట్టింది. ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఏపీలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడా అక్రమాలు కానీ, బూత్ ల క్యాప్చరింగ్ కానీ, సంఘ విద్రోహ శక్తులు దురాగతాలకు పాల్పడకుండా ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసింది. విజయవాడ సీఈవో కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి స్టేట్ వైడ్ గా నిఘా పెట్టారు.

అడిషనల్ సీఈవో హరీంద్ర ప్రసాద్..
* ప్రధానంగా 5 రకాల ఇష్యూస్ పై నిఘా పెట్టాము.
* ఒకటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయొలేషన్స్. దానికి సంబంధించిన ఫిర్యాదు వచ్చినప్పుడు మానిటరింగ్ చేస్తాం.
* రెండోది మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్. సర్టిఫికేషన్ లేకుండా ఏవైనా ప్రోగ్రాములు వస్తున్నాయా? ప్రకటనలు ఏమైనా టీవీ చానల్స్ లో వస్తున్నాయా? అన్నది మానటరింగ్ చేస్తాం.
* సీ విజిల్ యాప్ ద్వారా సిటిజన్స్ ఎత్తిచూపే ఫిర్యాదులపై స్పందిస్తాం.
* సిటిజన్స్ ఫిర్యాదుల్లో రెండు రకాలు.. ఒకటి అభ్యర్థుల వ్యయం గురించి ఫిర్యాదులు(డబ్బు పంచడం, ఉచితాలు ఇవ్వడం).
* పర్మిషన్ లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేయడం, రాత్రి పది తర్వాత ప్రచారం చేస్తున్నారు.. ఇలా ఫిర్యాదులను కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటరింగ్ చేస్తాం.

* ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ఏర్పాటు చేశాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 3 టీమ్స్ ఏర్పాటు.
* లిక్కర్ పై ఎక్కువ నిఘా పెట్టాం. లిక్కర్ గోడౌన్స్, డిస్ట్రిలరీస్, బ్రూవరీస్, ఔట్ లెన్స్ పై నిఘా.

నెల్లూరు జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధం..
నెల్లూరు జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 20,61,800. వీరిలో పురుషుల సంఖ్య 10,80,654. మహిళా ఓటర్ల సంఖ్య 10,52,819. ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య 211. జిల్లాలో 1,446 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం 14,687 మంది సిబ్బంది, రిజర్వ్ సహా 20 వేల మంది అందుబాటులో ఉన్నారు.

Advertisement

పోలింగ్ సిబ్బందిని తరలించడం కోసం జీపీస్ తో కూడిన 638 వాహనాలు ఏర్పాటు చేశారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగుల సంఖ్య 1624. వారంతా ఇంటి నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు 5 కోట్ల 53 లక్షల విలువైన నగదు, లిక్కర్ సీజ్ చేశారు అధికారులు. శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికలు ముగిసే 6 గంటల వరకు సైలెన్స్ పీరియడ్. జిల్లాలో ఓటు లేని వారు, బయటి వ్యక్తులు నెల్లూరు జిల్లాలో ఉండొద్దని అధికారులు చెప్పారు.

లాడ్జిలు, కల్యాణ మండపాలు చెక్ చేస్తామన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో వస్తుంది. ఎక్కడా నలుగురు కంటే ఎక్కువమంది గుమికూడకూడదు. మద్యం అమ్మకాలు నిలిపి వేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించ రాదు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు నీటి సౌకర్యం, టెంట్లు ఏర్పాటు. మోడల్ పోలింగ్ స్టేషన్లు 12 ఏర్పాటు చేశాం. ఓటర్లు అందరూ గుర్తింపు పొందిన కార్డుతో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళాలి. నెల్లూరు జిల్లాలో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి.

నెల్లూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్..
”పోలింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ వాతావరణంలో జరిగేలా చూస్తాం. పోలింగ్ కు ఎవరైనా ఆటంకాలు కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గెస్ట్ హౌస్ లు, కల్యాణ మండపాలు, లాడ్జ్ లు అన్నీ చెక్ చేస్తున్నాం. బయటి వ్యక్తులు ఎవరూ లేకుండా చూస్తాం”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version