Andhrapradesh

AP DSC TET Results Updates : ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు ఈసీ బ్రేక్, ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా

Published

on

AP DSC TET Results Updates : ఏపీ టెట్ ఫలితాలు(AP TET Results), డీఎస్సీ పరీక్షల(AP DSC Exams) నిర్వహణపై కేంద్రం ఎన్నికల సంఘం(EC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో డీఎస్సీ పరీక్షపై విద్యాశాఖ కొత్త షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి డీఎస్సీ పరీక్షలు(DSC Exams) నిర్వహించాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డీఎస్సీ పరీక్షల నిర్వహణ, టెట్ ఫలితాల (TET Results)విడుదలకు ఈసీని అనుమతి కోరుతూ విద్యాశాఖ లేఖ రాసింది. తాజాగా దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్(Election Code) ముగిసే వరకూ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వద్దని ఈసీ ఆదేశించింది.

విద్యాశాఖ క్లారిటీ
ఏపీ డీఎస్సీ పరీక్షలపై(AP DSC 2024) ఏపీ విద్యాశాఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి(మార్చి 30) నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పరీక్షల నిర్వహణ కోసం ఈసీకి లేఖ రాసింది విద్యాశాఖ. కానీ ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో మరోసారి డీఎస్సీ పరీక్షలను వాయిదా(AP DSC 2024 Postponed) వేసింది. ఈ మేరకు వెబ్ సైట్ లో విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన తర్వతే డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం కొత్త షెడ్యూల్ ను ప్రకటిస్తామని పేర్కొంది. పరీక్ష కేంద్రాల ఎంపిక ఆప్షన్లు కూడా ఈసీ అనుమతి వచ్చిన తర్వాతే అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.

డీఎస్సీ పరీక్షలు వాయిదా
అయితే డీఎస్సీ షెడ్యూల్ ప్రకారం మార్చి 25న నుంచే ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు(AP DSC Hall Tickets 2024) అందుబాటులోకి రావాల్సి ఉంది. ఈసీ అనుమతి రాగానే హాల్ టికెట్లను విడుదల చేస్తామని ఇటీవలే విద్యాశాఖ పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవటంతో మరోసారి డీఎస్సీ పరీక్షలు వాయిదా పడాల్సి వచ్చింది. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గ్యాప్ ఉండాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పటికే ఓసారి డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ ఆదేశాలతో డీఎస్సీ పరీక్షలు మళ్లీ వాయిదా(DSC Postponed) పడ్డాయి. మరోవైపు ఏపీ టెట్ ఫలితాలు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఫలితాలు వెలువడలేదు. ఎన్నికల కోడ్ కారణంతోనే టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది. ఈసీ అనుమతి ఇస్తేనే టెట్ ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ప్రస్తుతం టెట్ ఫలితాలు(AP TET Results 2024) కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. ఎన్నికల కోడ్ ముగిసే వరకూ టెట్ ఫలితాలు విడుదల చేయొద్దని ఈసీ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version