Andhrapradesh
AP Assembly Election Schedule :ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యుల్ విడుదల- మే 13 పోలింగ్, జూన్ 4 కౌంటింగ్
AP Assembly Election Schedule : ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీఐ విడుదల చేసింది. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్-2024(AP Assembly Election Schedule) ను భారత ఎన్నికల సంఘం(ECI) విడుదల చేసింది.తక్షణమే ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఉపఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు ఈసీఐ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏపీలోని ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ ఎన్నికలు నాల్గో విడతలో నిర్వహించనున్నట్లు ఈసీఐ తెలిపింది. ఏపీలో మే 13వ పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుందని సీఈసీ ప్రకటించారు.
తెలంగాణలో ఉపఎన్నిక
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ కారణంగా ఇక్కడ ఉపఎన్నిక నిర్వహణకు ఈసీఐ షెడ్యూల్ ప్రకటించింది. నాలుగే షెడ్యూల్ లో తెలంగాణలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.