Cinema

Anupam Kher : బాలీవుడ్ స్టార్ న‌టుడు ఆఫీసులో దొంగ‌లు ప‌డ్డారు.. వీడియో షేర్ చేసిన అనుప‌మ్ ఖేర్

Published

on

Anupam Kher Mumbai Office Robbed : బాలీవుడు స్టార్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఆఫీసులో దొంగ‌లు ప‌డ్డారు. త‌లుపులు ప‌గుల‌కొట్టి లోనికి ప్ర‌వేశించిన దొంగ‌లు సినిమా నెగిటివ్స్ దొంగించారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ అనుప‌మ్ ఖేర్ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇద్ద‌రు దొంగ‌లు ఈ ప‌ని చేసిన‌ట్లుగా చెప్పాడు.


వీడియోలో ఏం చెప్పాడంటే.. ‘వీర దేశాయ్ రోడ్‌లోని నా ఆఫీసులో దొంగ‌లు ప‌డ్డారు. ఇద్ద‌రు దొంగ‌లు త‌లుపు ప‌గుల‌గొట్టి లోప‌లికి వ‌చ్చి అకౌంట్ డిపార్ట్‌మెంట్ సెక్యూరిటీలో ఉన్న సినిమా నెగిటివ్స్‌ను దొంగిలించారు. విలువైన ప‌త్రాల‌ను ప‌ట్టుకుపోయారు. ఈ విష‌య‌మై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. దొంగ‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌ని పోలీసులు హామీ ఇచ్చారు. కాగా.. ఇద్ద‌రు దొంగ‌లు ల‌గేజీతో ఆటోలో వెళ్లిన‌ట్లు సీసీటీవీ కెమెరాలో క‌నిపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోక‌ముందు నా ఆఫీసులో పనిచేసేవారు తీసిన వీడియో ఇది’. అని అనుప‌మ్ ఖేర్ చెప్పాడు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version