International

అందరూ భారత్ ను గౌరవిస్తుంటే మనం దొంగలు అంటున్నాం పాకిస్తాన్ మంత్రి

Published

on

: భారత్‌పై పాకిస్థాన్‌ నేతల నుంచి ప్రశంసలు రావడం ఇటీవల క్రమంగా పెరుగుతోంది. భారత్‌ చంద్రుడిపై అడుగుపెడుతుంటే.. మన బిడ్డలు అడుక్కుంటున్నారని పాక్‌ పార్లమెంటు సభ్యులు ఆవేదన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
ఇది జరిగిన మరుసటిరోజే పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహ్సిన్‌నఖ్వీ కూడా భారత్‌ తీరును కొనియాడారు. తమ దేశంలో వ్యాపారవేత్తలను దొంగలుగా చిత్రీకరిస్తుంటే.. భారత్‌ మాత్రం అక్కడి వ్యాపారులకు పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఆ దేశ ప్రగతికి ఇదో కారణమంటూ ప్రశంసలు కురిపించారు.

” భారత్‌లో వ్యాపారవేత్తలకు గౌరవం ఉంటుంది. ప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుండటం ఆ దేశ పురోగతికి ఓ కారణం. కానీ, పాకిస్థాన్‌లో మాత్రం ఓ వ్యాపారవేత్త ఎదుగుతుంటే.. వారిని దొంగ అని ముద్ర వేస్తారు. ఓ వ్యాపారవేత్తగా.. నా డబ్బును నాకు నచ్చినచోట పెట్టుబడి పెడతా. నా భార్యకూ లండన్‌లో ఆస్తులున్నాయి. అక్కడ వాటికి పన్నులు కూడా చెల్లించాం. విదేశాల్లో పెట్టుబడి పెట్టడంలో తప్పు లేదు. అక్రమంగా సంపాదించే ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టవచ్చు’ అని అన్నారు. పాక్‌కు చెందిన పలు మీడియా సంస్థలకూ దుబాయ్‌లో ఆస్తులు ఉన్నాయన్నారు.

భారత్‌ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం

ప్రపంచ దేశాలకు చెందిన వేలాది మంది దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ‘దుబాయ్‌ లీక్స్‌’ పేరుతో విడుదలైన ఓ నివేదిక పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన 17 వేల మందికి భారీ సంఖ్యలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. వీటి విలువ దాదాపు రూ.90 వేల కోట్లకుపైనే ఉంటుందని లెక్క కట్టింది. పాక్‌ మంత్రి నఖ్వీ భార్య పేరు మీద విలువైన ఆస్తులు ఉన్నట్లు అందులో పేర్కొంది.

పాక్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ పిల్లలు.. బిలావల్‌ భుట్టో జర్దారీ, భఖ్త్‌వర్‌ భుట్టో, ఆసీఫా భుట్టో ఉన్నారు. వీరితోపాటు మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ తనయుడు హుస్సేన్‌ నవాజ్‌, ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వా తనయుడు కాద్‌ సిద్ధిఖీ బజ్వా, సెనెటర్‌ ఫైజల్‌ వావ్దా, సింధ్‌ సమాచార మంత్రి షర్జీల్‌ మేనన్‌తోపాటు అనేకమంది రిటైర్డ్‌ ఆర్మీ అధికారుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇలా పాక్‌ ప్రముఖుల పేర్లు ఉండడంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. వీళ్లంతా వేరే దేశాల్లో డబ్బులు దాచుకుంటుంటే.. విదేశాల నుంచి పాకిస్థాన్‌కు పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version