International

విమానం ఇంజిన్‌లో నాణేలు .. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Published

on

ఓ విమాన ప్రయాణికుడి మూఢనమ్మకం తోటి ప్రయాణికులను ప్రమాదంలోకి నెట్టింది. విమానం 4 గంటల ఆలస్యంగా బయలుదేరేందుకు కారణమైంది. చైనాలో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది. చైనా సదర్న్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్చి 6న సాన్యా నుంచి బీజింగ్ వెళ్లేందుకు రెడీ అవుతుండగా ఓ ప్రయాణికుడు ఊహించని చర్యకు పాల్పడ్డాడు. మూఢనమ్మకంతో అతడు అదృష్టం కోసమని విమానం ఇంజిన్‌లోకి నాణేలు విసిరాడు. చైనా మీడియా కథనాల ప్రకారం, నిందితుడు సుమారు మూడు నాలుగు నాణేలు విమానం ఇంజిన్‌లో విసిరినట్టు తెలిసింది. అనుమానితుడ్ని ఫ్లైట్ సిబ్బంది ప్రశ్నిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా నిందితుడు తన తప్పును అంగీకరించినట్టు కూడా వెల్లడైంది. దీంతో, నిర్వహణ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో, దాదాపు నాలుగు గంటల జాప్యం అనంతరం విమానం బయలుదేరింది. తనిఖీల సందర్భంగా విమానం ఇంజిన్‌లో నాణేలు లభించినట్టు ఎయిర్‌లైన్స్ సంస్థ పేర్కొంది. నిందితుడి వివరాలు కూడా ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version