National

AC helmets: వడోదరలో ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు; మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తారా..?

Published

on

AC helmets: దేశవ్యాప్తంగా వడగాల్పులు తీవ్రమవుతున్నాయి.రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్లపై ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ అస్వస్థతకు లోనవుతున్నారు. వారికి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించడానికి గుజరాత్ లోని వడోదరలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వడోదర ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకంగా ఏసీ హెల్మెట్లను తయారు చేసి, అందజేశారు.


ఐఐఎం వడోదర విద్యార్థుల ఆవిష్కరణ
ఐఐఎం వడోదరకు చెందిన విద్యార్థులు ఈ హెల్మెట్లను రూపొందించారు. ఇందులో బ్యాటరీని పొందుపర్చారు. అది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పనిచేస్తుంది. ఈ ఏసీ హెల్మెట్ తలకు సురక్షితంగా అమర్చుకోవచ్చు. దీని నుంచి చల్లని గాలి వీస్తుంది. ఇందులో చల్లగాలి కోసం ప్రత్యేకంగా వెంట్స్, సూర్యరశ్మి నుండి కళ్ళను రక్షించడానికి వైజర్ ఉంటుంది. ఈ హెల్మెట్ ను ట్రాఫిక్ పోలీస్ నడుము చుట్టూ అమర్చిన పెద్ద బ్యాటరీ ప్యాక్ కు కనెక్ట్ చేస్తారు. ఈ హెల్మెట్ బరువు కూడా చాలా తక్కువ. దీని బరువు గరిష్టంగా 500 గ్రాములు ఉంటుంది.

ప్రయోగాత్మకంగా అమలు..
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్రమైన వేడి కారణంగా డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు తరచూ మూర్ఛపోవడానికి దారితీస్తుంది. ఏసీ హెల్మెట్లు వారి అవిశ్రాంత సేవలకు కొంత ఊరటను ఇస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ ఏసీ హెల్మెట్లను వినియోగిస్తున్నామని, నగరంలోని ఆరు కూడళ్లలో పోలీసు అధికారులకు ఇచ్చామని వడోదర ట్రాఫిక్ విభాగం అధికారులు తెలిపారు. వడోదరాలోనే కాదు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కూడా ట్రాఫిక్ పోలీసుల కోసం ఇటీవల ఏసీ హెల్మెట్లను ప్రవేశపెట్టారు. ఈ ఆలోచనను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని ట్రాఫిక్ పోలీసులకు కూడా అమలు చేయాలని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version