Cricket

Abhishek Sharma: హ్యాట్రిక్ సిక్సులతో సెంచరీ.. గురువు రికార్డ్‌ను బ్రేక్ చేసిన శిష్యుడు.. అదేంటంటే?

Published

on

Abhishek Sharma – Yuvraj Singh: అభిషేక్ శర్మ టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ శిష్యుడు అని తెలిసిందే. పంజాబ్‌కు చెందిన అభిషేక్‌కు యూవీ ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. అలాగే ఈసారి ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో మెరిసిన అభిషేక్.. రెండో టీ20లో సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత యువరాజ్ సింగ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. అభిషేక్ ఇప్పుడు తన గురువు రికార్డును బద్దలు కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.

హరారేలో జింబాబ్వేతో జరిగిన 2వ టీ20లో అభిషేక్ శర్మ సెంచరీ చేసి ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ క్రమంలో అభిషేక్ యువరాజ్ సింగ్ పేరిట ఒక ప్రత్యేక రికార్డను బ్రేక్ చేశాడు. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌గా రంగంలోకి దిగిన అభిషేక్ శర్మ.. తొలి ఓవర్‌ నుంచే తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఫాస్ట్ బ్యాటింగ్‌పై దృష్టి సారించిన ఈ యువ లెఫ్ట్ హ్యాండర్ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా కేవలం 46 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 7 ఫోర్లతో తుఫాన్ సెంచరీ నమోదు చేశాడు.

విశేషమేమిటంటే, అభిషేక్ శర్మ తన 100 పరుగులలో 65 పరుగులను స్పిన్నర్ల ద్వారానే అందుకున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లను టార్గెట్ చేసిన అభిషేక్.. కేవలం 28 బంతుల్లో 65 పరుగులు చేశాడు. దీంతో యువరాజ్ సింగ్ తన పేరిట ఓ ప్రత్యేక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతకుముందు టీ20 ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించాడు. 2012లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ స్పిన్నర్లపై 57 పరుగులు చేసి ఈ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

Advertisement

12 ఏళ్ల తర్వాత ఈ రికార్డును బద్దలు కొట్టడంలో అభిషేక్ శర్మ సక్సెస్ అయ్యాడు. తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టడం కూడా విశేషం.

ఈ మ్యాచ్‌లో, అభిషేక్ శర్మ మూడు సిక్సులతో సెంచరీని పూర్తి చేశాడు. దీంతో 82 పరుగుల తర్వాత టీ20 క్రికెట్ చరిత్రలో హ్యాట్రిక్ సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version