Telangana
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అలీగఢ్ ముస్లీం విశ్వవిద్యాలయానికి తొలి మహిళ VC
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అలీగఢ్ ముస్లీం విశ్వవిద్యాలయానికి తొలి మహిళ వైస్ ఛాన్సలర్‌గా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో విద్యామంత్రిత్వశాఖ ఖాతూన్‌ని వీసీగా నియమించింది.
దీంతో అలీఘఢ్ విశ్వవిద్యాలయం మహిళా వైస్ ఛాన్సలర్‌ని కలిగి ఉన్న మూడవ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. ఈ విశ్వవిద్యాలయం 123 ఏళ్ల చరిత్రలో ఈ పదవికి నియమితులైన తొలి మహిళ ఖాతూన్. అయిదేళ్ల పాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు.
నైమా ఖాతూన్ అలీగఢః విశ్వవిద్యాలయం నుంచే మనస్తత్వ శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 1988లో అదే విభాగంలో లెక్చరర్‌గా తన ప్రస్థానం ప్రారంభించారు. క్రమంగా ఏప్రిల్ 1998లో అసోసీయేట్ ప్రొఫెసర్‌గా, ఆ తర్వాత 2006లో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్‌గా మారారు. ఆమె డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్, చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. ఆమె సైకాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్‌గా, చైర్‌పర్సన్‌గా పనిచేయడాని కంటే ముందు 2014లో మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించారు.
అలాగే ఆమె నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రువాండా, సెంట్రల్ ఆఫ్రికాలో ఒక ఏడాది పాటు ప్రొఫెసర్‌గా బోధించారు. ఆమె అలీగఢ్ విశ్వవిద్యాలయంలో వివిధ అడ్మినిస్ట్రేటివ్ పాత్రలలో కూడా పనిచేశారు, రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ ప్రొక్టర్, ఇందిరా గాంధీ హాల్ అండ్ అబ్దుల్లా హాల్ రెండింటిలోనూ ప్రోవోస్ట్‌గా పనిచేశారు.
ఆమె సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ, అలీగఢ్ విశ్వవిద్యాలయాల్లో డాక్టోరల్ వర్క్ నిర్వహించారు. అంతేగాక తన పరిశోధన పత్రాలను యూనివర్శిటీ ఆఫ్ లూయిస్‌విల్లే (USA), యూనివర్శిటీ ఆఫ్ ఆల్బా యూలియా (రొమేనియా), చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయం (బ్యాంకాక్), ఇస్తాంబుల్ (టర్కీ, స్టన్ (USA) రెండింటిలోని హోలింగ్స్ సెంటర్‌లో సమర్పించారు.
అంతేగాదు నైమా రచయిత, పరిశోధకురాలిగా రెండు పుస్తకాలను కూడా రచించారు. అలాగే ఆమె రచించిన క్లినికల్, హెల్త్, అప్లైడ్ సోషల్,ఆధ్యాత్మిక సైకాలజీ వాటికి సంబంధించిన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్‌లలో ప్రచురితమయ్యాయి. వృత్తిలో అల్ రౌండ్ ఎక్సలెన్స్ పరంగా నైమా ఖాతూన్ పాపా మియాన్ పద్మ భూషణ్ బెస్ట్ గర్ల్ అవార్డు వరించింది.