Political
ఏపీలో ఎన్నికల షెడ్యూల్‌పై ఉత్కంఠత: ఈసీ ఉన్నతస్థాయి సమీక్ష

Andhra Assembly elections 2024: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు వేడి క్రమంగా నెలకొంటోంది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారం నాటికి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగుస్తుందనే అంచనాలు ఉన్నాయి.
మే చివరి వారం నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్.. ఈ ప్రక్రియపై దృష్టి పెట్టారు. షెడ్యూల్ విడుదల చేయడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల తమ సమీక్ష సమావేశాలను మరింత ముమ్మరం చేశారు. సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్- స్వీప్ విభాగం డైరెక్టర్ సంతోష్ అజ్మీరా, ఇతర అధికారులు వెలగపూడి సచివాలయంలో నోడల్ అధికారులతో సమీక్షను నిర్వహించారు. అన్ని జిల్లాల స్వీప్ నోడల్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను సకాలంలో పూర్తి చేయాలని సంతోష్ అజ్మీరా ఆదేశించారు. షెడ్యూలు ప్రకటన, నోటిఫికేషన్ జారీకి ఎక్కువ సమయం లేదని, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
పోలింగ్ ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అజ్మీరా అన్నారు. ప్రత్యేకించి కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలను తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని, వారిని ఆ దిశగా చైతన్యవంతులను చేయాలని సూచించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం, వీవీప్యాట్‌పై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అజ్మీరా సూచించారు.
ఎన్నికల నిర్వహణకు సంబందించిన
మార్గదర్శకాలన్నింటినీ కూడా ఇప్పటికే అన్ని జిల్లాలకు పంపించామని ముఖేష్ కుమార్ మీనా గుర్తుచేశారు. వాటిపై జిల్లా ఎన్నికల అధికారులు సమగ్ర అవగాహనను పెంపొందించుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని చెప్పారు.
Political
ఏపీలో మధ్యంతర ఎన్నికలు?: హింట్ ఇచ్చిన సాయిరెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
విశాఖపట్నంలో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన.. పార్టీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్‌తో కలిసి మాట్లాడారు. ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయనే సంకేతాలను ఇచ్చారు. ఢిల్లీ రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ లేకపోవడం, భాగస్వామ్య పక్షాలతో బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చనే అభిప్రాాలు వ్యక్తమౌతోన్నాయి.
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తరచూ బెంగళూరుకు వెళ్లివస్తోండటం సైతం మధ్యంతర ఎన్నికల వార్తలకు బలాన్ని ఇచ్చినట్టవుతోంది. అదే సమయంలో- రాజ్యసభ సభ్యుడైన విజయసాయి రెడ్డి.. మధ్యంతర ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అయిదేళ్ల తరువాత ఎన్నికలు జరిగినా లేద మధ్యంతరం వచ్చినా తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన తేల్చి చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు
Political
బీఎస్పీ ఛీఫ్ కీలక నిర్ణయం.. వారసుడిని ప్రకటించిన మాయావతి

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ జాతీయ కన్వీనర్‌గా కూడా నియమించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. పార్టీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేళ బీఎస్సీ సుప్రీం లీడర్ మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. అంతేకాకుండా ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా కూడా నియమించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. పార్టీ భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాయవాతి జూన్ 23 ఆదివారం నాడు లక్నోలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశ్ ఆనంద్ సహా జాతీయ స్థాయి నేతలతో పాటు, అన్ని రాష్ట్రాలకు చెందిన బీఎస్పీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
గతంలో కూడా ఆకాశ్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించారు మాయావతి. అయితే ఎన్నికల ముందు అతడిని రెండు హోదాల నుంచి తొలగించారు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అనే అంశాల ప్రాతిపదికగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తిగా తాను, కాన్షీరామ్ కలిసి పార్టీని ఏర్పాటు చేసి, అందుకోసం తమ జీవితాలను సైతం త్యాగం చేశామని మాయావతి ఎన్నికల ముందు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీఎస్పీ 424 మంది అభ్యర్థులను బరిలో దించింది. వారిలో ఒక్కరు కూడా గెలవలేదు. ఈ క్రమంలో.. రెండు హోదాల నుంచి తొలగించిన కొన్ని రోజులకే, మాయావతి తన మేనల్లుడికి అవే హోదాలను తాజాగా తిరిగి కట్టబెట్టారు. బీఎస్పీలో యూత్‌లీడర్‌గా ఆకాశ్‌కు మంచి పేరుంది. చాలా దూకుడుగా వ్యవహరిస్తారని బీఎస్పీ నేతలు చెబుతుంటారు. అందుకే మేనల్లుడినే తిరిగి నమ్ముకున్నారు బెహన్‌జీ. పార్టీ పగ్గాలను ఆకాశ్‌కు అప్పగించాలని నిర్ణయించుకున్నారు.
Political
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు

Nallari Kiran Kumar Reddy: భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్ఠానం కీలక పదవిని కట్టబెట్టొచ్చనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.
ఆయనను తెలంగాణ గవర్నర్‌గా నియమించవచ్చని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు నల్లారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి ఆయనే. 2009లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డికి అదృష్టం వరించింది. ముఖ్యమంత్రి అయ్యారు.
రాష్ట్ర విభజన తరువాత చాలాకాలం పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేతిలో 76 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ గవర్నర్‌గా నామినేట్ చెయ్యొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తెలంగాణ, అక్కడి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్‌గా నియమించడం.. పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ లేరు. ఇప్పుడున్న సీపీ రాధాకృష్ణన్.. ఇన్‌ఛార్జ్ మాత్రమే. జార్ఖండ్‌కు ఆయన పూర్తిస్థాయి గవర్నర్‌గా ఉంటోన్నారు. గతంలో గవర్నర్‌గా పని చేసిన తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో దిగారు. మొన్నటి ఎన్నికల్లో చెన్నై సౌత్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
తమిళిసై సౌందరరాజన్ రాజీనామా తరువాత తెలంగాణ వంటి కీలక రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ లేకపోవడం సరికాదనే ఉద్దేశంలో ఉంది బీజేపీ. పైగా లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలిచి పట్టు నిలుపుకొంది. దీన్ని మరింత బలోపేతం చేసేలా కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్‌గా పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.
దీనికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అంగీకరించారనే అంటోన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు కావడం వల్ల గతంలో పార్టీలు వేరైనప్పటికీ.. వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే
-
Business10 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career10 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News10 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business10 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National10 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business10 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International10 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
National9 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Education9 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
Crime News9 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh9 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Telangana10 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National9 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh9 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Railways9 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National10 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Spiritual9 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Andhrapradesh9 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh9 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
Andhrapradesh1 year ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Andhrapradesh9 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National9 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
National9 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Political9 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
Andhrapradesh9 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh8 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
Andhrapradesh9 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
International10 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
National10 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh9 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh9 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National10 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Political9 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Business10 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
International10 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Cinema12 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
News10 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
Education9 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Weather9 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Andhrapradesh9 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Education1 year ago
2024 ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు తెలుగు వారికి చోటు
-
News9 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh9 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
Business10 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Railways8 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
Andhrapradesh1 year ago
ప్రమాదపుటంచుల్లో ప్రపంచం
-
Andhrapradesh10 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh9 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
International9 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
National1 year ago
బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్..