Andhrapradesh

250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన

Published

on

గత ఐదు సంవత్సరాల నుండి, రాజధాని ప్రాంతంలో ఏ పనులు జరగకపోవడం వలన విపరీతంగా చెట్లు పెరిగిపోయాయి వీటిని ప్రోక్లైన్లతో చాలా వేగంగా తొలగిస్తున్నారు. ఈనెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నందున ఈ ప్రాంతంలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. రాజధాని ప్రాంతం పూర్వ వైభవాన్ని సంచరించుకుంటున్నందున ఆ ప్రాంతంలో ఉండే రైతులు ,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మారిన దగ్గర నుండి రాజధాని ప్రాంతంలో భూముల రేట్లకు కూడా రెక్కలు వచ్చాయి . ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభమైంది.
మధ్యలో ఆగిపోయిన నిర్మాణాల పనులు కూడా వెంటనే ప్రారంభమవుతాయని అక్కడ అందరికీ పనులు దొరుకుతాయని ఆ ప్రాంతంలో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version