International

245రోజుల తర్వాత హమాస్ చెర నుంచి బయటపడ్డ ఇజ్రాయెల్ యువతి.. వీడియోలు వైరల్

Published

on

Israeli Woman : పాలస్తీనా గ్రూప్ హమాస్ చెరలో బందీగా ఉన్న ఇజ్రాయెల్ కు చెందిన 26యేళ్ల నోవా ఆర్గమాణి ఎట్టకేలకు బయటపడ్డారు. 245 రోజుల సుదీర్ఘ బందీ తరువాత ఆమెను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఆమెను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులను కలుసుకొని భావోద్వేగానికి గురయ్యారు.

గత ఏడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడిలో భారీ సంఖ్యలో ఇజ్రాయెల్స్ మరణించారు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పైసైతం హమాస్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 1,189 మంది మరణించగా.. 252 మందిని బందీలుగా తీసుకెళ్లారు. నోవా మ్యూజిక్ ఫెస్టివల్ లో ఉండగా హమాస్ చెరలో బందీ అయినవారిలో నోవా ఆర్గమాణి ఒకరు. అప్పటి నుంచి ఆమె హమాస్ బందీలోనే ఉంది. ఆమె బందీఖానాలో ఉన్న సమయంలో టెర్మినల్ బ్రెయిన్ క్యాన్సర్ తో ఆమె తల్లి లియోరా బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ గాజాలోని నుసిరత్ లో శనివారం ఐడీఎఫ్ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో నోవా ఆర్గమాణితో పాటు మరో ముగ్గురు బంధీలను బయటకు తీసుకొచ్చింది. వీరిలో ఆండ్రీ కోజ్లోన్, అల్మోగ్ మీర్ జాన్, ష్లోమి జివ్ లు ఉన్నారు.

నోవా ఆర్గమణి హమాస్ చెర నుంచి బయటపడిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి వద్దకు వెళ్లారు. తల్లి పరిస్థితిని చూసి ఆమె భావోద్వేగానికి గురైంది. మిలిటరీ హెలికాప్టర్ లో ఇజ్రాయెల్ కు తిరిగొచ్చిన తన కుమార్తెను చూసిన తండ్రి యాకోవ్ భావోద్వేగానికి గురయ్యాడు. తనను కలుసుకుంటానని అనుకోలేదని, తన కుతూరును కలవడం తనకు పట్టరాని సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. ఇదిలాఉంటే హమాస్ స్వాధీనం చేసుకున్న 251 మందిలో ఏడుగురు బందీలను ఇజ్రాయెల్ దళాలు సజీవంగా విడిపించాయి. ప్రస్తుతం గాజాలో ఇంకా 116 మంది బందీలుగా ఉన్నారు. వీరిలో 41 మంది చనిపోయారని సైన్యం భావిస్తోంది.


హమాస్ చెర నుంచి బయటపడిన ఆర్గమానితో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ మాట్లాడుతూ.. ఆర్గామని సురక్షితంగా తిరిగి వచ్చినందుకు వ్యక్తిగతంగా అభినందించారు. ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. మేము నిన్ను ఒక్కక్షణం కూడా వదులుకోలేదు. మీరు దానిని విశ్వసించారోలేదో నాకు తెలియదు. కానీ, మేము విశ్వసించాము.. మీరు బయటకు వస్తారని అనుకున్నాం. అది నిజమైనందుకు నేను సంతోషిస్తున్నానని అన్నారు.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version