National
కేంద్రం సంచలన నిర్ణయం ….సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.
GST Council Key Decisions: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటి జరిగింది. ఈ సమావేసశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా చిరు వ్యాపారులకు మేలు జరిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
జీఎస్టీ కౌన్సిల్ చివరి సమావేశం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. ఎన్నికల కోడ్ కారణంగా చాలా రోజులుగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ జరగలేదు. ఈ సమావేశంలో అనేక విషయాల గురించి చర్చించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోవాలని కేంద్రమంత్రి ప్రజలను కోరారు.
పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నామని సమావేశం అనంతరం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. జీఎస్టీ సెక్షన్ 73 కింద డిమాండ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. మార్చిలోగా పన్ను కట్టేవారికి కూడా పన్నులో మినహాయింపులు ఇస్తున్నట్లు వెల్లడించారు. జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ సమయం పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని.. అయితే సీజీఎస్టీ చట్టంలో పలు సవరణలకు జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కొన్నింటిపై జీఎస్టీని తగ్గించారు. రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్లు, వెయిటింగ్, లాకర్ రూమ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ సర్వీసులు, ఇంట్రా రైల్వే సర్వీసులపై జీఎస్టీ రద్దు చేశారు. దీంతో పాటుగా మిల్క్ క్యాన్లు, కార్టన్ బాక్సులపై GST 18% నుంచి 12%కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోలార్ కుక్కర్లపై 18% నుంచి 12%కు GST తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటితో పాటుగా విద్యాసంస్థలతో సంబంధంలేని హాస్టళ్లపై జీఎస్టీ నుంచి మినహా ఇస్తున్నట్లు ప్రకటించారు. నెలకు రూ.20 వేలు కంటే తక్కువ ఫీజు ఉన్న హాస్టళ్లకే ఈ రూల్ వర్తిస్తుంది.