Andhrapradesh

ఏపీలో ఆ శాఖ ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్ మరో రెండేళ్లు పొడిగింపు

Published

on

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అనేక రకాల శాఖల్లో ఎంతో మంది ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అనేక రకాలు ఉంటారు.
ఈ క్రమంలోనే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వాలు, హైకోర్టులు కీలక విషయాలను ప్రస్తావిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు అసంతృప్తి ఉండగా, మరికొన్ని విషయాల్లో మాత్రం శుభవార్తలే ఉంటాయి. తాజాగా ఏపీలోని ఓ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు ఓ శుభవార్త వచ్చిందనే చెప్పాలి. వారి పదవి విరమణ వయస్సును మరో రెండేళ్లు పెంచుతూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఆంధ్రప్రదేశ్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఎసీఎస్)లో పని చేస్తున్న ఉద్యోగులకు హైకోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పీఏసీఎస్ లో పని చేసే ఉద్యోగుల పదవి విరమణ గడువును రెండేళ్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఆ ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యే వరకు సర్వీసులో కొనసాగవచ్చని కోర్టు తెలిపింది. ఒకవేళ పీఏసీఎస్‌ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విమరణ చేసి ఉంటే వారి విషయంలోనూ కీలక అంశాలను ప్రస్తావించింది.

60 ఏళ్లకే పదవీ విరమణ చేసి వారు.. 62 ఏళ్లు పూర్తికాకుంటే తిరిగి నియమించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు వారికి జీతానికి సంబంధించి బకాయిలను చెల్లించాలని తెలిపింది. ఇదే సమయంలో హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. తాము ఇస్తున్న ఉత్తర్వులు 60 ఏళ్లు పూర్తికావడానికి ముందు పిటిషన్లు దాఖలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తమకు కూడా వర్తింపజేయాలని ప్రైమరీ అగ్రికల్చర్ కోపరేటీవ్ సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
వారి పిటిషన్ ను హైకోర్టు స్వీకరించి..వారి వాదనలు విన్నది. అలానే ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచుతూ చేసిన చట్టం పిటిషనర్లకు కూడా వర్తిస్తుందని వారి తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇదే సమయంలో పదవీ విరమణ వయసును పెంచే విషయంలో ప్రభుత్వ పర్మిషన్ తప్పనిసరి అని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి.. డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు పిటిషనర్లకు వర్తించదని తెలిపారు. పీఏసీసీఎస్‌ ఉద్యోగులు 62 ఏళ్ల వయసు నిండే వరకు సర్వీసులో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version