Andhrapradesh
ఈ నెల 24 నుండి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మూడురోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు.
ఈ నెల 24 నుంచి 26 వరకు సమావేశాలు జరగనున్నాయి. అయితే, వాస్తవానికి 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండడంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. సమావేశాలు ప్రారంభమయ్యేరోజు అనగా 24న ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. ఆ తరువాత నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రం ఉండనున్నది.
.