National

దేశంలో అతి పెద్ద తీగల వంతెన: ప్రారంభించిన మోడీ

Published

on

ఢిల్లీ: దేశంలో అతి పొడవైన తీగల వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారంనాడు గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ప్రారంభించారు.ఓఖా, బేట్ ద్వీపాలను కలుపుతూ సుదర్శన్ సేతు బ్రిడ్జిని నిర్మించారు.
రూ. 979 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. 2017 అక్టోబర్ మాసంలో ఈ బ్రిడ్జి పనులకు మోడీ శంకుస్థాపన చేశారు.పాత,కొత్త ద్వారకాలను కలిపేందుకు ఈ తీగల వంతెన ఉపయోగపడుతుంది
ఈ తీగల వంతెన నాలుగు లేన్లుగా ఉంది. ఈ తీగెల వంతెన 27.20 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రతి వైపు 2.50 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఫాత్ లను కలిగి ఉన్నాయి. సుదర్శన్ సేతు ప్రత్యేక డిజైన్ కలిగి ఉంది. ఈ బ్రిడ్జికి రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలను ఏర్పాటు చేశారు.
సిగ్నేచర్ బ్రిడ్జిగా పిలిచే ఈ వంతెనకు సుదర్శన్ సేతు లేదా సుదర్శన్ బ్రిడ్జిగా పేరు పెట్టారు. బేట్ ద్వారక అనేది ఓఖా పోర్ట్ సమీపంలో ఉన్న ఒక ద్వీపం. ఇది ద్వారకా పట్టణానికి దాదాపు 30 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడే శ్రీకృష్ణుడి ప్రసిద్ద ద్వారకాధీష్ ఆలయం ఉంది.
ఈ వంతెనను ప్రారంభించే ముందు ప్రధాని నరేంద్ర మోడీ ద్వారకాధీష్ ఆలయంలో ప్రార్థనలు చేశారు. రాజ్ కోట్ లో ఎయిమ్స్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మధ్యాహ్నాం ప్రారంభించనున్నారు. రాజ్ కోట్ తో పాటు ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లలో కూడ మరో నాలుగు ఎయిమ్స్ లను కూడ ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.రాజ్‌కోట్‌లోని ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కేంద్రం రూ. 6,300 కోట్లతో నిర్మించింది.రాజ్ కోట్ లో ఇవాళ సాయంత్రం రోడ్ షో లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version