Success story

ట్రిపుల్‌ఐటీ స్టూడెంట్‌కు రూ.85 లక్షల ప్యాకేజీ.. ఐఐటీ, ఐఐఎంలకు గట్టి పోటీ

Published

on

Success Story: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఐఐటీ(IIT), ఐఐఎం(IIM), ఎన్‌ఐటీ(NIT)ల్లోనే చదవాల్సిన అవసరం లేదు. పట్టుదల, కృషి, తెలివితేటలు ఉంటే సాధారణ ఇన్‌స్టిట్యూట్‌ల్లో చేరి కూడా చదువులో అద్భుతంగా రాణించి, ఇంటర్వ్యూలో ప్రతిభను చాటుకోవచ్చు.
ఇలాంటి విద్యార్థులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. బీటెక్ గ్రాడ్యుయేట్ రాశి బగ్గా కూడా ఇదే కోవకు చెందుతుంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో ఆమె భారీ ప్యాకేజీతో ఉద్యోగం సొంతం చేసుకుంది.

85లక్షల ప్యాకేజీ..

సాధారణంగా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో చదివిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో భారీ ప్యాకేజీలతో ఉద్యోగ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు మనం తరచుగా వింటుంటాం. అయితే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నయా రాయ్‌పూర్ (IIIT-NR)కు చెందిన విద్యార్థిని రాశి బగ్గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. గతేడాది జరిగిన ఇంటర్వ్యూలో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ఆకట్టుకుంది. రూ.85 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొంది ప్రత్యేకత చాటుకుంది.

* చాలా ఇంటర్వ్యూలకు హాజరు

ప్రముఖ కంపెనీ నుంచి లాభదాయకమైన ఉద్యోగ ఆఫర్ ఉన్నప్పటికీ, రాశి బగ్గా పట్టుదలతో అదనపు అవకాశాల కోసం ప్రయత్నించింది. చివరికి రికార్డు స్థాయిలో రూ. 85 లక్షల ఆఫర్‌ను సొంతం చేసుకుంది. ఈ అద్భుత ప్రయాణంలో రాశి బగ్గా వరుసగా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైంది. అన్ని చోట్ల తిరుగులేని నిబద్ధత, అద్భుతమైన పనితీరుతో రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించింది.

Advertisement

* కలిసొచ్చిన ఇంటర్న్‌షిప్

ఇంటర్వ్యూలకు ముందు వివిధ సంస్థల్లో రాశి బగ్గా (Rashi Bagga)ఇంటర్న్‌గా పనిచేసింది. భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించడంలో ఇంటర్న్‌షిప్స్ ఆమెకు బాగా కలిసివచ్చాయి. బెంగళూరు(Banglore)లోని ఇన్‌ట్యూట్(Intuit)లో SDE ఇంటర్న్‌గా పనిచేసింది. ఆ తరువాత అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంటర్న్‌గా విలువైన ఎక్స్‌పీరియన్స్ సొంతం చేసుకుంది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. 2023 జులై నుంచి అట్లాసియన్‌లో ప్రొడక్ట్ సెక్యూరిటీ ఇంజనీర్‌గా ఉద్యోగ బాధతలు నిర్వర్తిస్తోంది.

* మునుపటి విద్యార్థుల రికార్డు

ట్రిపుల్‌ఐటీ-నయా రాయ్‌పూర్‌కు చెందిన మరో విద్యార్థి చింకీ కర్దా, అంతకుముందు సంవత్సరంలో రూ.57 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొందాడు. ఈ రికార్డ్‌ను రాశి బగ్గా బద్దలుకొట్టింది. మునుపటి రికార్డును నెలకొల్పాడు. యోగేష్ కుమార్ అనే మరో విద్యార్థి ఓ మల్టినేషన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రోల్ కోసం సంవత్సరానికి రూ. 56 లక్షల ప్యాకేజీని అందుకున్నాడు. 2020లో ట్రిపుల్‌ఐటీ నయా రాయ్‌పూర్‌కు చెందిన రవి కుశాశ్వ అనే విద్యార్థి ఒక బహుళజాతి కంపెనీ నుంచి సంవత్సరానికి కోటి రూపాయల జాబ్ ఆఫర్‌ అందుకున్నాడు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అతను కంపెనీలో చేరలేకపోయాడు.

* సక్సెస్ స్టోరీ ..

Advertisement

IIIT-NR ప్లేస్‌మెంట్ ఆఫీస్ ప్రకారం.. ప్రస్తుత బ్యాచ్‌కి సగటు CTC సంవత్సరానికి రూ.16.5 లక్షలకు చేరింది. గతంలో ఇది సంవత్సరానికి రూ. 13.6 లక్షలుగా ఉండేది. ఆ లెక్కన విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భారీ ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారని అర్థమవుతుంది.

* అరుదైన గౌరవం..

ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- నయా రాయ్‌పూర్ (IIIT-NR)కు చెందిన విద్యార్థిని రాశి బగ్గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. రూ.85 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ పొంది ప్రత్యేకత చాటుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version