Spiritual

కృష్ణా నదిలో ప్రత్యక్షమైన రాముడి విగ్రహాలు! అచ్చం అయోధ్యలోలా!

Published

on

సాధారణంగా హిందువులకు పురాతన దేవతామూర్తుల విగ్రహాలు అంటే చాలా మక్కువ. అలాంటి విగ్రహాలు ఇటీవలే తెలుగు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కృష్ణా నదిలో అనేక సార్లు బయటపడ్డాయి.
ఈ విగ్రహాలను వేటకు వెళ్లిన మత్సకారులకు దొరకడంతో.. వారు వాటిని బయట పెట్టేవారు. ఇప్పటికే పలు సార్లు నాగదేవత విగ్రహాలు, శివలింగం, విష్ణుమూర్తి, నంది ఇలా సుమారు 11 రకాల రాతి విగ్రహాలను గుర్తించడంతో.. ఆ విగ్రహాలు బయటపడేవి. వీటిని చూడటానికి ప్రజలు, తండోపతండాలుగా తరలి వచ్చేవారు. తాజాగా ఇలాంటి సంఘటనే తెలంగాణ -కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కృష్ణా నదిలో జరిగింది. అక్కడ వంతెన పనులు జరుగుతున్న సందర్భంగా..సాక్ష్యత్తు ఆ దేవతామూర్తి విగ్రహాం బయటపడింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణా నదికి సంబంధించి వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం వంతెన పనులు చేపడుతుండాగా.. నదిలో కొన్ని విగ్రహాలు దర్శనమిచ్చాయి. వాటిని అలా తవ్వుతుండగా.. సాక్ష్యత్తు శ్రీ మహా విష్ణువు నిలువెత్తు విగ్రహం, ఒక శివలింగం దర్శనమిచ్చింది. దీనిని అధికారుల ఆదేశాలతో అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టి విగ్రహాలుకు ఎటువంటి దెబ్బతినకుండా బయటకు తీశారు. వాటిలో శ్రీమహావిష్ణువు విగ్రహం పరిశీలించగా.. అది ఇటీవలే అయోధ్య రామలయంలో ప్రతిష్టించిన రామ్‌ లల్లా విగ్రహంలా ఉంది. పైగా ఆ విగ్రహాలు శతాబ్దాల చరిత్ర చెందినవిలా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా శ్రీమహా విష్ణువుని చూస్తే.. నాలుగు చేతులతో నిలబడిన ఆకారంలో ప్రత్యేకంగా కనిపించింది. అలాగే పై చేతుల్లో శంఖు చక్రాలు, మరో రెండు చేతుల్లో కటి హస్త, వరద హస్త ఉన్నాయి. విష్ణువు చుట్టూ మత్య్స, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి వంటి దశావతారాలు కలిగి ఉన్నాయి. ఇది అచ్చం వేంకటేశ్వర స్వామి పోలిక మరింత ఆకర్షణీయంగా ఉంది. అయితే విష్ణువు విగ్రహంలో ఉండే గరుడుడు ఈ విగ్రహంలో లేకపోవడం విశేషం. ఇక ఈ విగ్రహంపై పూలమాలలు కూడా ఉండడం విశేషం. దీంతో ఈ వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వ్యాపించింది. స్థానిక ప్రజలు దీనిని చూడటానికి చాలా ఆసక్తి కనుబరుచుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version